రాష్ట్రీయం

సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిల ఐక్యతారాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలు, 11 ఏరియాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు ఐక్యతారాగాన్ని ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఓడించాలనే లక్ష్యంతో ఎఐటియుసికి మద్ద తు ప్రకటించాయి. కాంగ్రెస్ అనుబంధ సిం గరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్‌టియుసి), తెలుగునాడు ట్రేడ్ యూనియన్ (టిఎన్‌టియుసి)లు సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసికి మద్దతు ఇచ్చాయి. తెలుగుదేశం పార్టీ కార్య నిర్వాహణ అధ్యక్షు లు రేవంత్ రెడ్డి హైద్రాబాద్‌లో జరిగిన సమావేశంలో మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. సింగరేణి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఓడించేందుకు పొత్తులు కుదుర్చుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టిజిబికెఎస్), భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్), సింగరేణి కాలరీస్ ఎంప్లారుూస్ యూనియన్ (సిఐటియు), హెచ్‌ఎంఎస్‌లు ఒంటరిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. అక్టోబర్ 5న జరిగే ఎన్నికలకు సంబంధించినామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది.