రాష్ట్రీయం

రూ. 10కోట్లు డిపాజిట్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీలను స్వాధీనం చేసుకునేందుకు ముందుకు వచ్చిన సుభాష్ చంద్ర ఫౌండేషన్ (ఎస్సెల్ గ్రూప్-జీటివి)ను రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం, జస్టి స్ ఎస్‌వి భట్‌లతో కూడిన డివిజన్‌బెంచ్ గురువారం అగ్రిగోల్డ్ యాజమాన్యం, సిఐడి అధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించిన ఆస్తులు, అప్పులపై వివరాలను సుభాష్ చంద్ర ఫౌండేషన్‌కు అందచేయాలని ఆదేశించారు.
తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై విచారణ జరుగుతోంది. అగ్రిగోల్డ్ స్కాంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని, ప్రజల నుండి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి ఇప్పించాలని పిటిషనర్లు కోరారు. అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు అప్పుల జాబితాలను ఈ కంపెనీకి అప్పు ఇచ్చిన బ్యాంకుల తరఫున అడ్వకేట్ కోర్టుకు సమర్పించేందుకు ముందుకు వచ్చారు.
అగ్రిగోల్డ్ అప్పులు, ఆస్తులకు సంబంధించిన వివరాలను అందించేందుకు నాలుగు వారాల సమయం కావాలంటూ అగ్రిగోల్డ్ కంపెనీ తరఫు న్యాయవాది కోరారు. ఆస్తుల కొనుగోలుకు ముందుకు వచ్చిన ఎంఎంఆర్ గ్రూప్ కోర్టుకు అందించిన 4.11 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కావడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఎంఎంఆర్ గ్రూప్ 4.11 కోట్ల రూపాయలతో ఒక డిమాండ్ డ్రాఫ్ట్ ను కోర్టుకు సమర్పించింది. మిగతా 75 శాతం డబ్బును సెప్టెంబర్ 30 లోగా డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించి, కేసును సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.