రాష్ట్రీయం

విద్యా ప్రమాణాలు పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు పెంచాలని, జవాబుదారీతనాన్ని తీసుకురావాలని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డితో పాటు ఉన్నతాధికారులు గురువారం నాడు గవర్నర్‌ను కలిసి కొత్త వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రిని, ప్రొఫెసర్ వి వెంకటరమణను పరిచయం చేయడంతో పాటు విద్యారంగ పరిస్థితులను వివరించారు. ఇటీవల వివిధ యూనివర్శిటీలకు, విద్యాసంస్థలకు నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడిటేషన్ సంస్థ ఇచ్చిన అక్రిడిటేషన్లు, ఇతర వివరాలను గవర్నర్‌కు వివరించారు. యూనివర్శిటీలు సజావుగా పనిచేసేలా చూడాలని, అవి తమ పనితీరును ఎప్పటికపుడు స్వీయ సమీక్ష జరుపుకోవాలని , ఎప్పటికపుడు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా విద్యా ప్రమాణాల పెంపునకు ప్రయత్నించాలని చెప్పారు. తెలంగాణలో యూనివర్శిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఖాళీల భర్తీ, నిధుల కొరత, ప్రమాణాలు, పరిశోధనలు, అంతర్జాతీయ రేటింగ్, అక్రిడిటేషన్ వంటి అంశాలపై సమగ్ర నివేదికలను తయారుచేసి తదనుగుణంగా వాటిని సాధించేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. వైస్ చాన్సలర్ల సదస్సు అక్టోబర్‌లో నిర్వహించేందుకు వీలుగా సన్నద్ధం కావాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డిని గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు రాష్ట్రంలో యూనివర్శిటీలు, స్థితిగతులపై ఉన్నత విద్యామండలి చైర్మన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దశల వారీగా అన్ని కాలేజీలు, యూనివర్శిటీలు అక్రిడిటేషన్ తీసుకునేలా తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నట్టు పాపిరెడ్డి వివరించారు.