రాష్ట్రీయం

833 అడుగులకు శ్రీశైలం నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 14: శ్రీశైలం జలాశయానికి వరద నిలకడగా కొనసాగుతోంది. ఎగువ నుంచి 16 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా గురువారం 833.20 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 52.89 టిఎంసిల నీరు ఉంది. జూరాల నుండి 16 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. 338 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్‌కు 2 టిఎంసిల నీటి విడుదల
విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జునసాగర్ జలాశయానికి గురువారం విద్యుత్ ఉత్పాదన అనంతరం 6557 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. నాగార్జునసాగర్ జలాశయానికి 2 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున 2 టిఎంసిల నీటిని సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 500 అడుగులకు పడిపోవటంతో హైదరాబాద్, నల్గొండ జిల్లాల ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం కనీస నీటిమట్టం కన్నా తక్కువగా ఉండటంతో హైదరాబాద్ ప్రజలకు తాగునీటి అవసరాల కోసం విడుదల చేయనున్నారు. సాగర్ కనీస నీటిమట్టం 510 అడుగులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 500 అడుగులకు చేరుకుంది.