రాష్ట్రీయం

ఆర్టీసీపై ఆంధ్రదే పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు దాటిన తర్వాత ఎట్టకేలకు ఆర్టీసీ ఉమ్మడి ఆస్తుల పంపిణీ పంచాయితీలో ఏపీ నెగ్గింది. ఉమ్మడి రాష్ట్రాల్లోని విలువైన 14 ఆస్తుల పంపకాలకు సంబంధించిన ఒకే అంశంతో కూడిన అజెండాపై శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ భవన్‌లో ఏపిఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.మాలకొండయ్య అధ్యక్షతన కీలకమైన బోర్డు సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటలపాటు ఏపి, తెలంగాణ ఆస్తుల పంపకాలపై వాడిగా చర్చ జరిగింది. ఆంధ్రలో ఆర్టీసీకి సంబంధించి ఒక్క అనంతపురంలోనే పవన్ విద్యుత్ కేంద్రం ఉండగా, తెలంగాణలోని హైదరాబాద్‌లో బస్ భవన్ పక్కనే పాత భవనం కూల్చివేత తర్వాత ఖాళీగా ఉన్న స్థలం, తార్నాకలోని ఆసుపత్రి, కల్యాణ మండపం, మియాపూర్‌లో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్, ప్రింటింగ్ ప్రెస్, హైదర్‌గూడలోని గెస్ట్‌హౌస్, చైర్మన్ నివాసిత క్వార్టర్ వంటి మొత్తం 13 రకాల ఆస్తులున్నాయి. అయితే వీటిలో 12 ఆస్తులను తెలంగాణాకు ఇచ్చి, మిగిలిన ఆర్టీసీ భవన్ విలువ లెక్కించి అందులో వాటా సొమ్ము ఆంధ్రకు చెల్లిస్తామంటూ సమావేశం ఆరంభంనుంచి టిఎస్‌ఆర్టీసీ ప్రతినిధులు వాదించటం ప్రారంభించారు. అయితే తొలి రోజుల్లోనే విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 4వేల కోట్లు పైగా ఉన్న అప్పులను ఆంధ్రకు 58 శాతం చొప్పున దాదాపు 2వేల 400 కోట్లు అప్పగించినప్పుడు, ఇప్పుడు ఆస్తుల పంపకాల్లో వివక్ష ఏమిటంటూ ఏపిఎస్‌ఆర్టీసీ ప్రతినిధులు గట్టిగా ప్రశ్నించారు. అప్పులు ఎలా విభజించారో అలాగే ఆస్తులనూ దామాషా ప్రకారం కేటాయించాలన్నారు. అవసరమైతే అనంతపురంలోని విద్యుత్కేంద్రం విలువ లెక్కించి 42 శాతం సొమ్ము చెల్లిస్తామని ఖరాఖండిగా చెప్పారు. కేంద్రం తరపున హాజరైన ఇద్దరు ప్రతినిధులు కూడా ఏపి వాదనను సమర్థించడంతో ఏపి బలం పెరిగింది. దీంతో ఓటింగ్ జరపాలంటూ పట్టుబట్టారు. ఓటింగ్ జరిగితే ఓటమి ఖాయమని గుర్తించిన తెలంగాణ అధికారులు తెలివిగా డిసెంట్ ఇచ్చి వాకౌట్ చేశారు. మిగిలిన 8 మందిలో ఓటింగ్‌ను ఏ ఒక్కరూ వ్యతిరేకించకపోవటంతో మూజువాణితో 14 ఆస్తులు కూడా 58:42 శాతం దామాషాతో పంపిణీ జరగాలనే అంశం నెగ్గటంతో ఆమేరకు తీర్మానం చేశారు. ఇక దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. తెలంగాణ సిఎం కేసిఆర్ సమావేశానికి ముందుగానే హాజరయ్యే అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఏవిధంగా వ్యవహరించాలో దిశా నిర్దేశం చేసి పంపించారు కూడా. అయితే సమావేశంలో అందుకు భిన్నంగా జరిగింది. సమావేశానికి ఏపిఎస్‌ఆర్టీసీ తరపున రాష్ట్ర రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు కోటేశ్వరరావు, ఎవి రావు, సత్యనారాయణ, టిఎస్‌ఆర్టీసీ తరపున తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్, ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, టిఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ రమణారావు, కేంద్రం తరపున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, సెంట్రల్ ఇన్‌స్టిట్యూషన్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ డైరెక్టర్ కెప్టెన్ రాజేంద్ర బి సనీర్ పాటిల్ (పూనె), అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఇడి పి ఆనందరావులతో పాటు, అధ్యక్షత వహించిన బోర్డు చైర్మన్ మాలకొండయ్యతో సహా మొత్తం 13మంది హాజరయ్యారు.
తక్షణం ఆస్తుల పంపిణీ జరగాలి: ఇయు డిమాండ్
కీలకమైన ఉమ్మడి బోర్డు సమావేశంలో తీర్మానం జరిగినందున ఇక ఏమాత్రం జాప్యం లేకుండా ఆస్తుల పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి రావు అన్నారు. షెడ్యూలు 9, 10లోని ఉమ్మడి ఆస్తుల పంపిణీ కోసం కేంద్రం ఏనాడో షీలాబేడీ కమిటీని నియమించినప్పుడు ఇంతకాలం ఎందుకు కాలయాపన జరిగిందో అర్థం కావటం లేదన్నారు. సిఎంలు ఇద్దరు ఒకసారి కూర్చుని సామరస్యంగా చర్చించుకుని ఉంటే బాగుండేదన్నారు.

చిత్రం.. ఏపీఎస్‌ఆర్టీసీ ఎండి మాలకొండయ్య అధ్యక్షతన జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశం