రాష్ట్రీయం

కుటుంబం ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 15: ఆర్థిక సమస్యల నేపధ్యంలో ఓ కుటుంబం జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కడప జిల్లా మైలవరంలో శుక్రవారం వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నీట మునిగి చనిపోవడం సంచలనం రేపింది. మృతుల కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం జమ్మలమడుగు మండలం రాజీవ్‌నగర్‌కాలనీలో నివాసం ఉంటున్న షేక్ వాహిద్‌కు ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు. కూరగాయలు విక్రయించి జీవనం సాగించే వాహిద్‌ను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన వాహిద్ కుటుంబం ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.
అంతా కలిసి మైలవరం జలాశయంలో దూకినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఓ పురుషుడు, ఇద్దరు మహిళల మృతదేహాలు నీళ్లలో తేలడం గమనించిన కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను ఒడ్టుకు చేర్చారు. ఒడ్డుపై వీరికి సంబంధించిన ఆధార్‌కార్డులు, చెప్పులు కనిపించాయి.
దీంతో గజఈతగాళ్ల సాయంతో జలాశయంలో గాలించగా మరో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. ఆధార్‌కార్డుల్లోని వివరాల మేరకు మృతులను వాహిద్ (42), అతని ఇద్దరు భార్యలు షమీమ్ (40), ఆయేషా (29), కూతుళ్లు మహబూబ్‌బీ (19), షబానా (17)గా గుర్తించారు. షమీమ్ సోదరి రజియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మైలవరం ఎస్‌ఐ సునీల్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ సంఘటనతో జమ్మలమడుగు రాజీవ్‌నగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది.