రాష్ట్రీయం

17.5 టిఎంసి నీళ్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణలో హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మంచినీటి అవసరాల నిమిత్తం 17.5 టిఎంసి నీటిని శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు విడుదల చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి తాజాగా మరో లేఖ రాసింది. కృష్ణా బోర్డు రెండు రోజుల క్రితం 2 టిఎంసి నీటిని శ్రీశైలం నుంచి విడుదల చేయాలని ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విధితమే. ప్రస్తుతం సింగూర్ నుంచి హైదరాబాద్‌కు మంచినీటి అవసరాలకు సరఫరా చేస్తున్నా, ఈ నీరు మరో 15 రోజులకంటే మించి సరిపోకపోవచ్చు. అందుకే శ్రీశైలంలో ఉన్న 40 టిఎంసిలో 17.25 టిఎంసి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేయాలని కోరినట్టు సాగునీటి అధికార వర్గాలు తెలిపాయి. కానీ ఆంధ్ర ప్రభుత్వం తమ వినతిని పరిగణనలోకి తీసుకుని విడుదల చేస్తుందనే నమ్మకం లేదని ఇరిగేషన్ వర్గాలు చెబు తున్నాయ. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం వచ్చే వరకు నీటిని దిగువకు విడుదల చేయవద్దని రాయలసీమ రైతాంగం రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తుంది. అందుకే శ్రీశైలం నుంచి జల విద్యుదుత్పత్తిని కూడా ప్రారంభించినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
ఎపెక్స్‌ను తక్షణమే సమావేశపర్చండి
కృష్ణా జలాలతోపాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షించి ఒక నిర్ణయం తీసుకునేందుకు రెండు రాష్ట్రాల సిఎంలతో కూడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డు కేంద్రాన్ని మరోసారి కోరింది. గత పక్షం రోజుల్లో రెండోసారి కేంద్రానికి కృష్ణా బోర్డు లేఖ రాసింది. గత ఏడాది సెప్టెంబర్ 21న ఢిల్లీలో రెండు రాష్ట్రాల సిఎంల సమావేశాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే వివాదాలు ముదరకుండా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డు కేంద్రాన్ని కోరుతోంది. తెలంగాణలో నాలుగు ప్రాజెక్టులు, ఆంధ్రలో పది ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయని, వీటిపై డిపిఆర్‌లను ఇరు రాష్ట్రాలు ఇంతవరకు సమర్పించలేదన్నారు. ఈ ప్రాజెక్టులపై తమ అభిప్రాయాలను తెలియచేయడం క్లిష్టంగా మారిందని బోర్డు అధికారులు చెబుతున్నారు. వరద నీటి ప్రవాహం అంతంతగా ఉండి, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీరు అడుగంటడంతో రానున్న రోజుల్లో సమస్యలు జటిలమవుతాయని ఇరు రాష్ట్రాల సాగునీటి శాఖ అధికారులు అంటున్నారు.