రాష్ట్రీయం

జంతువుల హక్కులను పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: జంతువుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ పేర్కొన్నారు. మనుషులకు హక్కులు ఉన్నట్టే జంతువులకు కూడా ఉంటాయని గుర్తించాలని, ఈ విషయంలో యువత చైతన్యం కావాలని అన్నారు. జంతుజాలాన్ని పరిరక్షించినపుడే మనిషి మనుగడ సాధ్యమవుతుందని, జీవావరణమే ఆర్ధిక వనరుగా గుర్తించాలని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం నాడు నగరంలో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫిక్కీ మహిళా సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అనంతరం నల్సార్‌లో జంతు పరిరక్షణ చట్టాల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె జంతుపరిరక్షణపై సుదీర్ఘ ఉపన్యాసం చేశారు.
పండగల పేరుతో జంతు హింస
నల్సార్‌లో జంతు పరిరక్షణ న్యాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అనంతరం మాట్లాడుతూ పండగల పేరుతో దేశంలో పలు ప్రాంతాల్లో జంతు హింస జరుగుతోందని, ఒక మతానికి చెందిన వారు మేకలు, ఆవులు, ఒంటెలు, జిరాఫీలను తింటున్నారని వారి ఆర్ధిక స్థాయిత్వానికి ప్రతీకగా జంతువులను తింటున్నారని ఇది దారుణమని అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పండగల సందర్భంగా కోళ్లు, మేకపోతు, గొర్రెపోతులను బలి ఇస్తున్నారని అనంతరం వాటిని తింటున్నారని, అలాగే తమిళనాడులో జల్లికట్టు పేరుతో జంతుహింస జరుగుతోందని పేర్కొన్నారు. దేశంలో జంతుపరిక్షణపై అందరిలో చైతన్యం రావాలని, వాటికీ ప్రత్యేక హక్కులు ఉంటాయని గుర్తించాలని పేర్కొన్నారు. దేశంలో జంతుసంరక్షణ కేంద్రాల్లో ఉన్న జంతువులకు కనీసం ఆస్పత్రులు లేవని, అవి అస్వస్థతకు గురైతే వాటి పరిస్థితి ఏమిటో ఆలోచించాలని అన్నారు. అదే వన్యప్రాణులకు అనారోగ్యం వస్తే వాటి దుస్థితి ఏమిటో ఆలోచించాలని పేర్కొన్నారు. కచ్ ప్రాంతంలో సైనికుల కోసం ఒంటెలు ఏర్పాటు చేశారని, కాని రోజురోజుకూ వాటి సంఖ్య తగ్గిపోయాయని, అయినా ఎవరికీ పట్టడం లేదని అన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ముస్త్ఫా, ప్రొఫెసర్ జి జయసింహ తదితరులు పాల్గొన్నారు.
సాధికారత సాధించాల్సి ఉంది
ఫిక్కీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళల సాధికారికత అంత తేలికేం కాదని, ఒక్కో ఇటుక పేర్చి గోడను నిర్మించడం వంటిదని అన్నారు. భర్త చనిపోతే వారసత్వ సర్ట్ఫికెట్‌కు మహిళలు నానా అగచాట్లు పడుతున్నారని, ముందే ఆ డాటాలో భార్య పేరు నమోదు చేస్తే సర్ట్ఫికెట్ తేలికగా వస్తుందని భావించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మహిళలు పురుషులతో సమానంగా ముందుకు రావాలని, ఇప్పటికీ మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్లేందుకు జంకుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్ కామిని షరాఫ్ సహా వందలాది మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు మేనకా గాంధీ అంకిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్‌లోని మూర్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైనె్సస్‌లో ఉన్న మహాత్మాజ్యోతి బాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి, విద్యార్థినులతో ముచ్చటించారు. అక్కడే వన సంరక్షణ ప్రారంభించారు.