రాష్ట్రీయం

అందుబాటులోకి 1962

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రైతు బాగుంటేనే అంతా బాగుంటారని, సమాజమూ బాగుంటుందని సిఎం చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో సంచార పశువైద్య శాలను ప్రారంభించిన సందర్భంలో మాట్లాడుతూ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చామని, అందుకనుగుణంగా పంపిణీ ప్రక్రియ చేపట్టామన్నారు. ఇప్పటికే 20 లక్షల గొర్రెల పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న ఏడు లక్షల మందికి గొర్రెలు అందిస్తామని చెప్పారు. విదేశాలకు మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి యాదవులు ఎదగాలని ఆకాంక్షించారు. పాల ఉత్పత్తి, పశు సంపద పెరిగితేనే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. రైతుకు కావల్సింది సాగుకు నీరు, పెట్టుబడి, గిట్టుబాటు ధర మాత్రమేనన్నారు. ప్రాజెక్టులను ఆగమేఘాల మీద పూర్తి చేస్తున్నామని, కాళేశ్వరం నుండి వచ్చే ఏడాదిలో ఏడు జిల్లాలకు సాగునీరు అందతుందని హామీ ఇచ్చారు. రైతు సంఘాలు ఎవరి హక్కులనూ హరించబోవని స్పష్టం చేశారు. రైతులు సంఘటితమైతే గిట్టుబాటు ధరను నిర్ణయించుకోగలుగుతారని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కెసిఆర్ సంచార పశు వైద్యశాల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. దీంతో 100 సంచార వైద్య శాలలు రాష్టవ్య్రాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. 1962 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే అన్ని సదుపాయాలు ఉన్న వాహనాలు గ్రామానికి వచ్చి సేవలు అందిస్తాయి. ఒక్కో వాహనంలో వైద్యుడితోపాటు కాంపౌండర్ ఉంటారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో వాహనం అందుబాటులోకి వస్తుంది. కార్యక్రమంలో డిప్యూటి సిఎం మహముద్ అలి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ రాజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామమోహన్, ఎంపి విశే్వశ్వరరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..నెక్లెస్ రోడ్డులో సంచార పశు వైద్యశాల వాహనాలను ప్రారంభిస్తున్న సిఎం కెసిఆర్