ఆంధ్రప్రదేశ్‌

బొగ్గు గనుల్లో ఎన్నికల వేడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 15: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎవరికి వారు గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నామినేషన్ల దాఖలుకు తొలిరోజు గురువారం ఒకటి, శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు, ఉపసంహరణకు 19వ తేదీ వరకు గడువు ఉన్న నేపథ్యంలో చివరి రోజున నామినేషన్లు వేసేందుకు అన్ని సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. శుక్రవారం ప్రధాన సంఘాలైన ఎఐటియుసి, టిబిజికెఎస్, హెచ్‌ఎంఎస్, బిఎంఎస్, సిఐటియు నామినేషన్లు దాఖలు చేశాయి. అక్టోబర్ 5వ తేదీన జరిగే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని సంఘాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని ఉపరితల భూగర్భ గనుల్లో 53,146 మంది కార్మికులు, ఉద్యోగులు ఓటర్లుగా ఉన్నా రు. కార్మికుల హక్కులు, సమస్యలపై యాజమాన్యంతో చర్చించడం, అవసరమైతే ఆందోళనకు పిలుపునిచ్చే అవకాశం ఈ ఎన్నికల్లో గెలిచిన సంఘానికే ఉంటుంది. ఎన్నికల బరిలో దిగేందుకు 17 సంఘాలు నమోదు చేసుకోగా ఇందు లో ఐదు విప్లవ సంఘాలు కూటమిగా ఏర్పడ్డాయి. ఎఐటియుసి, ఐఎన్‌టియుసి పొత్తు పెట్టుకోడంతో మొత్తం 11 సంఘాలు బరిలో ఉన్నట్లైంది. ప్రధాన పోటీ మాత్రం ఎఐటియుసి, హెచ్‌ఎంఎస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మధ్యనే ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఐదుసార్లు ఎన్నికలు జరగ్గా ప్రస్తుతం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉంది. ఆరవ విడత ఎన్నికల్లో కార్మికుల ప్రధాన డిమాండైన వారసత్వ ఉద్యోగాలు ప్రధాన అం శంగా ప్రచారం జరుగుతోంది. కార్మికులకు సంస్థ సొంత ఇళ్ళు నిర్మించేలా పోరాడతామని సంఘా లు స్పష్టం చేస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజునే అన్ని సంఘాలు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఆరు జిల్లాల పరిధిలో విస్తరించిన సింగరేణి ఎన్నికల్లో విజయం ఆ పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఎవరికి వారు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. అధికార తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న నిజామాబాద్ ఎంపి కవిత తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన రాష్ట్ర మంత్రులు జోగు రామన్న, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు ప్రచారంలో పాల్గొననున్నారు. సిపిఐకి అనుబంధంగా ఉండే ఎఐటియుసికి కాంగ్రెస్ అనుబంధంగా ఉన్న ఐఎన్‌టియుసితో పాటు తెలుగుదేశంకు అనుబంధం గా ఉన్న తెలుగునాడు కార్మిక సంఘం కూడా మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంఘానికి మద్దతుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, గుండా మల్లేష్, కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు శ్రీ్ధర్‌బాబు, వెంకటరమణారెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, శాసన సభాపక్ష నేత రేవంత్‌రెడ్డి ప్రచారం మొదలుపెట్టారు. సిపిఎం అనుబంధ సిఐటియుకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బిఎంఎస్‌కు మద్దతుగా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రచారం ప్రారంభించారు.