రాష్ట్రీయం

శరన్నవరాత్రోత్సవాలకు శ్రీశైలంలో విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 15: శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాలు ఈనెల 21 నుంచి 30 తేదీ వరకు నిర్వహించనున్నారు. దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పిస్తున్నారు. సేవా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లతోపాటు 9 రోజులపాటు ఆలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించనున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు వసతి కల్పించడంతో పాటు సులువుగా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవడంలో ఆలయ అధికారులు నిమగ్నమయ్యారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకారంలో పూజలు చేస్తారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు వాహనసేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు 21వ తేదీ శైలపుత్రి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. స్వామి వారికి భృంగివాహన సేవ ఉంటాయి. 22న బ్రహ్మచారిణి అలంకారం, మయూర వాహనసేవ, 23న చంద్రఘంట అలంకారం, రావణవాహన సేవ, 24న కూష్మాండదుర్గ అలంకారం, కైలాస వాహన సేవ, 25న స్కంధమాత అలంకారం, శేషవాహన సేవ, 26న కాత్యాయని అలంకారం, హంసవాహన సేవ, పుష్పపల్లకి సేవ, 27న కాళరాత్రి అలంకారం, గజవాహన సేవ, 28న మహాగౌరి అలంకారం, నందివాహన సేవ, 29న సిద్దిదాయిని అలంకారం, అశ్వవాహన సేవ, 30న శ్రీ భ్రమరాంబదేవి నిజాలంకరణ, నందివాహన సేవ ఉంటాయి. ఉత్సవాల్లో భాగంగా 9 రోజులపాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, నవ వరణార్చనలు ఆలయ అర్చక వేదపండితులు ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.