రాష్ట్రీయం

చేసిన తప్పులు దిద్దుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 16: పర్యావరణానికి చేటు కలిగిస్తున్న మనిషే పర్యావరణ పరిరక్షణకు సంకల్పించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ అభిప్రాయపడ్డారు. విశాఖలో రెండు రోజుల పాటు జరగనున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ప్రాంతీయ సదస్సును శనివారం ప్రారంభించారు. మానవుడు తన అవసరాల కోసం చేపడుతున్న కార్యకలాపాలు, పర్యావరణానికి తీరని విఘాతం కలిగిస్తున్నాయన్నారు. అటవీ ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నామని, ఉపాధి కోసం పారిశ్రామికీకరణకు ప్రాధాన్యతనిస్తున్నామని, తద్వారా కాలుష్యం కోరలు చాస్తోందన్నారు. మితిమీరిన ప్లాస్టిక్ వినియోగం, ఆక్వా సాగు, వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం వంటి అంశాలు పర్యావరణ వినాశనానికి దారితీస్తున్నాయన్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, పర్యావరణ సమతౌల్యత దెబ్బతినడంతో పాటు జీవవైవిద్యాని విఘాతమేర్పడుతోందన్నారు. లక్షలాది హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతోందని, ప్లాస్టిక్ వినియోగం పరిధి మించి కొనసాగుతోందని, వ్యవసాయంలో 24 శాతం రసాయన ఎరువుల వినియోగం అనివార్యమైందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే సమస్యలు పర్యావరణాన్ని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయన్నారు. తద్వారా వ్యాధుల తీవ్రత పెరుగుతోందన్నారు. ఇన్ని సమస్యలకు మూలం మానవుడు అనుసరిస్తున్న పర్యావరణ ప్రతికూల విధానాలేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తప్పిదాలను నియంత్రించుకుంటూ ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలన్నారు. న్యాయస్థానాల జోక్యంతో సమస్యకు పరిష్కారం రాదని, ప్రజల్లో అవగాహనతోనే సాధ్యమని పేర్కొన్నారు. అలాగే పర్యావరణానికి నష్టం చేకూర్చే వారిపై కఠిన చర్యలకు వెనుకాడరాదన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ హితమైన వాతావరణంలో జీవించే హక్కు ప్రతి పౌరునికీ ఉందని, అటువంటి పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అయితే మితిమీరిన పారిశ్రామికీ కరణ వంటి అంశాలు పర్యావరణ పరంగా ప్రమాదకర స్థాయికి తీసుకువెళ్లాయన్నారు. పారిశ్రామికకీకరణ జరగాలని, ఆర్థికాభివృద్ధి సాధించాలని, అయితే ఇదే సందర్భంలో పర్యావరణానికి ముప్పు తీసుకురాకూడదని సూచించారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యానికి కారణంగా గుర్తించి సుమారు 8వేల పరిశ్రమలను తరలించాలని న్యాయస్థానం ఆదేశించిందని, అయితే సామాజిక, ఆర్థిక కారణాల రీత్యా ఈ తీర్పు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. న్యాయస్థానాల జోక్యంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం కాదని, ప్రజలు కూడా తమ బాధ్యతను నిర్వహించాలన్నారు. పర్యావరణ పరిరక్షణపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చొరవ చూపాలన్నారు. ఎన్‌జిటిని మరింత బలోపేతం చేసి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ మాట్లాడుతూ కర్బన ఉద్గారాలు పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రాలు పట్టణాలను కబళించే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్‌లో ముప్పు ఎదుర్కొనే సముద్ర తీరాల్లో ముంబై, చెన్నై, ఒడిశా ప్రాంతాలున్నాయన్నారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ ముప్పు నుంచి బయటపడగలమన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ స్వతంత్ర కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలే కారణమన్నారు. ఒకప్పుడు బెంగళూరు, సిమ్లా నగరాల్లో కనీసం ఫేన్లు కూడా వాడేవారు కాదని, ఇప్పుడు ఈ రెండు నగరాల్లో ఎసిల వాడకం విపరీతంగా పెరిగిందన్నారు. ఎసీల వాడకం వల్ల విడుదలయ్యే గ్యాస్ ఓజోన్ పొరపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. ప్రకృతిని మనం కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుందని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో ఎపి అడ్వొకేట్ జనరల్ డి శ్రీనివాస్, గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై స్పెషల్ జోన్ జ్యుడీషియల్ సభ్యులు పి జ్యోతిమణి, ఎంఎస్ నంబియార్, పిఎస్ రావు, జిల్లా జడ్జి పివి జ్యోతిర్మయి, చీఫ్ కన్సర్వేటర్ రాహుల్ పాండే, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉప కులపడి వి కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాంతీయ సమావేశంలో మాట్లాడుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ