రాష్ట్రీయం

బీసీలను మభ్యపెట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే ప్రసక్తిలేదని, బీసీలను మభ్యపెట్టకుండా ఈ వర్గాల కుటుంబాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వ పథకాలు రూపొందించి అమలు చేయాలని సిఎం కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. బీసీల అభ్యున్నతికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రగతిభవన్‌లో శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కులాల వారీగా, వృత్తుల వారీగా ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వివిధ కులాలు, వృత్తులకు చెందిన ప్రతినిధులతో తాను నేరుగా త్వరలోనే సమావేశాలు నిర్వహించి, ఆయా కులాల అభ్యున్నతికి చేపట్టాల్సిన పథకాలపై స్పష్టత తీసుకువస్తానన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికే బీసీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తోందని గుర్తు చేశారు. బీసీల్లో స్వయం ఉపాధి చేపట్టిన వారికి ప్రోత్సాహం అందించాలని ఆదేశించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఒక్కో కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందేలా పథకాలు రూపొందించాలన్నారు. ఇప్పటికే ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యికోట్లు కేటాయించామని గుర్తు చేశారు. ఈ కార్పొరేషన్ ద్వారా పూర్తిగా వెనుకబడ్డ బీసీలకు ఆర్థిక చేయూత ఇస్తామన్నారు. ఇప్పటికీ సంచార జాతులు చాలా వరకు పూర్వపు విధానాల్లోనే జీవిస్తున్నారని కెసిఆర్ గుర్తు చేశారు. కొన్ని వృత్తులు అంతరించిపోయాయని, వారు వేరే ఉపాధిమార్గాలు చూస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారందరికీ ఎంబిసి ద్వారా ఆర్థిక సాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఏటా 60 వేల నుండి 70 వేల కుటుంబాలకు సాయం అందించాలన్నదే ఈ కార్పోరేషన్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమన్నారు. ఎంబిసి కార్పోరేషన్‌కు వచ్చే ఏటా నిధులను మరింత పెంచుతామన్నారు. బిసి కులాలకు చెందిన వారు, వారు చేసే పనులు సమాజం మొత్తానికి ఉపయోగకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బిసి కులాల లేకుంటే సమాజం ఈ విధంగా ఉండబోదన్నారు. రజకులు, నాయిబ్రాహ్మణులు, మేధరులు, దర్జీ, కంసాలి, వండ్రంగి, కమ్మరి, కుమ్మరి..ఇలా ప్రతి వృత్తి సమాజంలో కీకమైనందేనని గుర్తు చేశారు. ఈ కారణంగా మొత్తం సమాజం కులవృత్తుల వారికి అండగా ఉండాలని కోరారు. బిసిల కులాలు, వృత్తులకు అనుగుణంగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పన జరగాలన్నారు.
గొల్ల, కుర్మల కోసం నాలుగువేల కోట్ల రూపాయలతో గొర్రెల పంపిణీ చేపట్టామని కెసిఆర్ పేర్కొన్నారు. మత్స్యకారులకు వెయ్యికోట్ల రూపాయలతో చేపల పెంపకం చేపట్టామని గుర్తు చేశారు. చేనేత కార్మికులకు 1200 కోట్లతో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. రజకులు, నాయిబ్రాహ్మణులు, కుమ్మర, పంచకర్మల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. విశ్వబ్రాహ్మణుల్లో ప్రధానంగా పంచకర్మలున్నాయని, వీరి కులవృత్తులకు అనుగుణంగా అవసరమైన పనిముట్లు, పెట్టుబడికి సాయం చేస్తామన్నారు. రజకుల కోసం దోబీఘాట్లను నిర్మిస్తున్నామని, డయింగ్ మిషన్లను ఇస్తున్నామని, నాయిబ్రాహ్మణులకు నవీన క్షౌరశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 25 వేల సెలూన్లకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
గతం తరహా వద్దు
గత ప్రభుత్వాల హయాంలో ‘నామ్‌కే వాస్తే’గా పథకాలు రూపొందించారని, ఆ పథకాల వల్ల ఎవరికీ లబ్ది చేకూరలేదని సిఎం పేర్కొన్నారు. బిసిల జీవితాల్లో నిజమైన మార్పు రావాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మంత్రులు జోగురామన్న, టి. హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఎంబిసి చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, బిసి సంక్షేమ కార్యదర్శి అశోక్‌కుమార్, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్. నర్సింగరావు, కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బీసీల అభ్యున్నతిపై ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయ సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్