రాష్ట్రీయం

తిరగబడిన ఉగ్రవాద ఖైదీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న ఐసిస్ ఉగ్రవాద ఖైదీలు హల్‌చల్ చేశారు. ఇబ్రాహీం యజ్ఞాని, మహమ్మద్ ఇలియాస్ యజ్దాని, అతవుల్లా రహ్మాన్‌లను ఏడాది క్రితం కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వీరిని అరెస్టు చేసి జైలులో ఉంచింది. నాటి నుంచి అండర్ ట్రయల్ ఖైదీలుగా చంచల్‌గూడ జైల్లోనే విచారణ ఖైదీలుగా ఉంటున్నారు. పాతబస్తీకి చెందిన వీరిని కలిసేందుకు శనివారం మధ్యాహ్నం వీరి బంధువులు జైలుకు వచ్చారు. వికెట్ గేట్ వద్ద బంధువులు వారి కోసం తెచ్చిన బ్రెడ్, డ్రైఫ్రూట్స్‌తో వేచి ఉన్నారు. కాగా కొంతమంది జైలులోని ఖైదీలను కోర్టుకు తీసుకెళ్తుండగా, అదే సమయంలో వీరి కుటుంబీకులను కలిసేందుకు ఈ ముగ్గురికి అనుమతిచ్చారు. ములాఖత్ కోసం వచ్చిన వారి వస్తువులను చెక్ చేయడంతో వారు ఖైదీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఈ ముగ్గురు ఖైదీలు అసభ్య పదజాలంతో వార్డర్లు భరత్‌కుమార్, సంపత్‌కుమార్‌లపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో భరత్‌కుమార్ కంటికి గాయమైంది. మిగతా సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై జైలు సిబ్బంది డబీర్‌పుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు.