రాష్ట్రీయం

ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న షెల్ కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడుతుండటం దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే జాడ్యాలలో ఒకటని, ఈ తరహా కంపెనీలు, షెల్ ఎన్‌జిఓల వల్ల కలిగే దుష్పరిణామాలపై దేశంలో అవగాహన పెరగాలని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో జిఎస్‌టి అమలులో ఎదురయ్యే సవాళ్లను కంపెనీ సెక్రటరీలే పరిష్కరించగలగాలని పేర్కొన్నారు. ఉప రాష్టప్రతి శనివారం నాడు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబలైజేషన్ , ఆర్ధిక వ్యవస్థలను ముందుకు నడపడంలో కార్పొరేట్ల పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తమ పద్ధతుల్లో తులతూగే ఆధునిక జ్ఞానాన్ని , నైపుణ్యాలను అలవరచుకోవడంతో పాటు మంచి కార్పొరేట్ పాలనను పెంచి పోషించడం కంపెనీ సెక్రటరీల వంటి వృత్తి నిపుణులకు తప్పనిసరి అన్నారు. కార్పొరేట్ పాలనలో ఉన్నత ప్రమాణాలకు ఒక గీటురాయిని ఏర్పరచడమే కాకుండా ఆ కోవకు చెందిన కేంద్రాలు పరిశోధనకు , కొత్త కొత్త పద్ధతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కార్పొరేట్ పాలనలో మార్పును తీసుకురాగల పరిశోధనలను చేపట్టడం, ఈ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను సాధించడం, పరిశోధన సంబంధిత సమస్యలను పరిష్కరించడం కోసం సమన్వయపూర్వక నెట్‌వర్కులను నిర్మించడం, గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్‌ను సాధించడం, భారతీయ పరిశోధనలకు గుర్తింపును రావడం గురుతర బాధ్యతగా ఉప రాష్టప్రతి చెప్పారు. కార్పొరేట్ పాలనకు బలమైన పునాది కలిగిన నైతిక విలువలు ప్రాతిపదిక అవుతాయని గుర్తుచేశారు. కౌటిల్యుడు ఆర్ధిక నిర్వహణపై రచించిన సూత్రాలు, పద్ధతులు ఇప్పటికీ ఆచరణీయంగా ఉన్నాయని అన్నారు. కార్పొరేట్ సుపరిపాలనను ప్రొత్సహించడంలో ప్రపంచశ్రేణి నాయకత్వ స్థానాన్ని భారత్ అందుకోవాలని అన్నారు. కార్పొరేట్ గుడ్ ప్రాక్టీసెస్‌కు బాట వేస్తే కార్పొరేట్ వివాదాలు తగ్గుతాయని అన్నారు.
కంపెనీ సెక్రటరీలు కంపెనీల మనస్సాక్షిగా ఉండటమే గాక, సామాజిక బాధ్యత కూడా వహించాలని చెప్పారు. వస్తువులు, సేవల పన్ను అమలులోకి రావడంతో వివిధ సంస్థలు, వ్యక్తులు ఈ పన్ను పద్ధతి విషయంలో సమస్యలు ఎదుర్కోకుండా సరైన మార్గదర్శకత్వాన్ని కంపెనీ సెక్రటరీలే వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో ఐసిఎస్‌ఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ప్రారంభించి ప్రసంగిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్య