రాష్ట్రీయం

ఏదీ ఎక్స్‌ప్రెస్ హైవే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాని ప్రభావం వివిధ ప్రాజెక్టులపై పడుతోంది. నిధుల కొరత వల్ల అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే భూసేకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకూ 27 శాతం మేర భూసేకరణ మాత్రమే జరగడం గమనార్హం.
రాయలసీమ ప్రాంతం నుంచి రాజధాని అమరావతికి వీలైనంత త్వరగా చేరుకునేలా ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 557 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మిస్తారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో మలుపులు లేని రహదారిపై సురక్షితంగా ప్రయాణించేలా దీన్ని తీర్చిదిద్దాలని సంకల్పించారు. దాదాపు 27,265 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. అనంతరపురం, కడప, కర్నూలు జిల్లాలను అమరావతితో అనుసంధానం చేయటమే దీని లక్ష్యం. ఈ రహదారి నిర్మాణానికి 8562 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ 856 హెక్టార్ల భూమి మాత్రమే సేకరించారు. రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి సేకరించేందుకు 2200 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీన్ని జాతీయ రహదారిగా గుర్తించినప్పటికీ, భూసేకరకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అనంతపురం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ కొంత వేగంగా జరుగుతున్నప్పటికీ, గుంటూరు జిల్లాలో ఆశించిన మేర పురోగతి కనిపించటం లేదు. గుంటూరులో 91 కిలోమీటర్లకు సంబంధించి భూసేకరణ జరగాల్సి ఉండగా, కేవలం 38.6 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే జరిగింది.
భూసేకరణకు కావాల్సిన నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో దాని ప్రభావం ఇలాంటి ప్రధాన ప్రాజెక్టులపైనా పడుతోంది.