రాష్ట్రీయం

ప్రతి తలుపూ తట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: ‘ఇంటింటికీ తెలుగుదేశం ప్రతి ఎస్సీ, ఎస్టీ కాలనీలో నిర్వహించాలి. ప్రతి ఒక్క ఇంటి తలుపునూ తట్టాలి. వారి యోగక్షేమాలు విచారించాలి. బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించాలి. వారి అవసరాలను గుర్తించాలి. సమస్యలను నమోదు చేయాలి’ అని శ్రేణులకు తెదేపా జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఇంటింటికీ తెలుగుదేశంపై పార్టీ నేతలతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘75 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం. వాడవాడలా సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నాం. ఎల్‌ఈడి బల్బులు పంపిణీ చేస్తున్నాం. పింఛన్లు, రేషన్ కార్డులు 100 శాతం సంతృప్త స్థాయికి చేరేలా అందిద్దాం’ అని చెప్పారు. ఇంటి జాగా, పింఛన్, రేషన్ కార్డు కావాల్సిన వారి వివరాలు తెలుసుకోవాలని నాయకులకు సూచించారు. రాజకీయ లాభాల కోసం ఎస్సీ, ఎస్టీ, ముస్లింలను వాడుకున్నారేతప్ప వారి అభ్యున్నతికి కాంగ్రెస్, వైపాకాలు చేసిందేమీ లేదన్నారు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని, నిధులివ్వకుండా నీరుగార్చారని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించి దుర్వినియోగం చేశారన్నారు. టిడిపి ప్రభుత్వం గత మూడేళ్లుగా అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టి వారి సంక్షేమానికి అమలు చేస్తోందని ఆయన గుర్తుచేశారు. ఎస్సీలకు ముందడుగు, ఎస్టీలకు చైతన్యం, ముస్లింలకు రోష్నీ పథకాలను మళ్లీ ప్రారంభిస్తున్నామని, ఈ పథకాలను నిలిపివేసి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందన్నారు. మాదిగల రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనన్నారు. ‘నంద్యాలలో ముస్లింలు అంతా ఏకపక్షంగా టిడిపికి మద్దతు పలకడం కొత్త చరిత్ర. దీన్ని అందరూ స్వాగతించాలి. రాష్టవ్య్రాప్తంగా అన్ని నియోజకవర్గాల ముస్లింలకు నంద్యాల స్ఫూర్తి కావాలి. కాకినాడలో ఎస్సీలంతా టిడిపికి అండగా నిలిచారు. ఇది మరో చరిత్ర. దీన్ని అందరూ ఆహ్వానించాలి. కాకినాడ ఎస్సీల ముందడుగు మిగిలిన అన్ని ప్రాంతాల ఎస్సీలకు స్ఫూర్తిదాయకం కావాలి. బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతులు, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ వర్గాల్లో 80 శాతం టిడిపికి అండగా ఉండేలా వారిలో అవగాహన పెంచాలి, చైతన్యపరచాలి’ అంటూ చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలతో తరచూ సమావేశాలు జరిపి సంతృప్తే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీసీలు టిడిపికి వెనె్నముక అని, వారి అభ్యున్నతే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి జవహర్, కార్పొరేషన్ల చైర్మన్లు వర్ల రామయ్య, పుష్పరాజ్, శివాజీ, ఎమ్మెల్యేలు అనిత, యామినీబాల, శ్రావణ్‌కుమార్, ఆనందరావు, మణిగాంధీ, సునీల్‌కుమార్, శమంతకమణి, ఎలక్షన్ బాబు, చిరంజీవి, ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.