రాష్ట్రీయం

ఫార్మా పార్క్‌పై 11న ప్రజాభిప్రాయ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఫార్మా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా మేడిపల్లి ప్రాంతంలో ఫార్మా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుపై వచ్చే నెల 11న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నది. ఫార్మా పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. సుమారు 14 వేల ఎకరాల్లో ఫార్మా ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌కు చెందిన ఒక సంస్థ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసి తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి సంస్థ (టిఎస్‌ఐఐసి)కు అప్పగించింది. అయితే ఏదైనా ఇండస్ట్రి ఏర్పాటు చేయాలన్న దానికి పర్యావరణ, అటవీ శాఖల అనుమతి తప్పని సరి. ఆ అనుమతుల కంటే ముందు స్థానిక ప్రజల అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వచ్చే నెల 11న అభిప్రాయ సేకరణ చేపట్టనున్నది.