రాష్ట్రీయం

వనజీవి రామయ్యకు ప్రధాని లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 19: జాతిపిత మహాత్మాగాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి దరిపల్లి రామయ్యకు ఆహ్వానం పలుకుతూ ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారు. వన సంరక్షణ, పర్యావరణాన్ని పరిరక్షించడంలో రామయ్య తనకు తానే సాటి. 70ఏళ్ళ పైబడిన రామయ్య తన చిన్నతనంనుంచే మొక్కలు నాటుతూ హరితహారం కోసం తనదైన శైలిలో ఎనలేని కృషి చేస్తున్నారు. ఆయన చేస్తున్న కృషిని గుర్తించి భారత ప్రభుత్వం రామయ్యకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో భారత ప్రధాని మోదీ పిలుపుమేరకు పాల్గొని ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా రామయ్య సోమవారం స్పష్టం చేశారు.

చిత్రం..ప్రధాని రాసిన లేఖను చూపుతున్న రామయ్య దంపతులు