తెలంగాణ

దసరా, దీపావళి పండుగలకు రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టిఎస్‌ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. స్కూళ్లకు, కాలేజీలకు దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో బస్సులు, రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దసరా,దీపావళి పండుగల కోసం సొంతూళ్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే గత సంవత్సర సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో 148 ప్రత్యేక రైళ్లు నడుపగా, ఈ సంవత్సరం 208 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
వీటికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆరు డివిజన్ల నుంచి 120 ప్రత్యేక రైళ్లు తమ సర్వీసులను సిద్ధం చేశాయి. దక్షిణ మధ్య రైల్వేలో ప్రతి రోజు 748 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్, సికిందరాబాద్, కాచిగూడ నుంచి 150 రైళ్లకు పైగా రెగ్యులర్ రైళ్లు నడుస్తున్నాయి. సాధారణ రోజుల్లో ప్రయాణికుల రద్దీ 2లక్షల వరకు ఉంటుంది. పండుగల వేళల్లో సుమారు ఐదు లక్షల వరకు ఉంటుందని రైల్వే అధికారుల అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకుని సికిందరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రితోపాటు నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాలకు రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ తెలిపారు. అదేవిధంగా పండుగలకు మూడు రోజుల ముందు ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
రైల్వే స్టేషన్లలో పారిశుద్ధ్యం, భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. రైల్వేతోపాటు ఆర్టీసీ కూడా ముందస్తు ఏర్పాట్లు చేసింది. దసరా ప్రయాణికుల కోసం 3600 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఒంగోలు, కందుకూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురంతోపాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు సూచనలు ఇచ్చేందుకు 300 మంది అధికారులను వివిధ పాయింట్లలో ఏర్పాటు చేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ వైపు వెళ్లే బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మాత్రమే నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
వరంగల్ వైపు వెళ్లే ప్రయాణికుల కోసం ఉప్పల్ నుంచి, విజయవాడ వైపు వెళ్లే వారి కోసం ఎల్‌బినగర్, దిల్‌సుఖ్‌నగర్, కెపిహెచ్‌బి, లింగంపల్లి, ఈసిఐఎల్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఇక నెల్లూరు, ఒంగోలు వెళ్లేవారి కోసం సిబిఎస్ హ్యాంగర్ నుంచి బస్సులను నడుపనున్నారు. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 50శాతం అదనపు చార్జీలు ఉంటాయని అధికారులు తెలిపారు. రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలావుండా గత సంవత్సరం రైల్వే, ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచిన ప్రత్యేక రైళ్లు, బస్సులు సరిపోలేదని విమర్శలు వచ్చాయి. అయితే ఈ సంవత్సరం రైల్వే, ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్న బస్సులు, రైళ్లు ఏ మేరకు ప్రయాణికులకు సరిపోతాయో చూడాలి.