రాష్ట్రీయం

ఆరుగురు ఐసిస్ ఖైదీలు పరారీ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో ఉగ్రవాద ఖైదీల హల్‌చల్ కలకలం రేపుతోంది. ఇటీవల జైలులో శిక్ష అనుభవిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు ములాఖత్ సందర్భంగా జైలు సిబ్బంది వార్డర్లపై దాడికి పాల్పడిన సంఘటన తెలిసిందే. గురువారం జైలులో బారికేడ్‌ల నుంచి ఉగ్రవాద ఖైదీలు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దేశంలోని పలు నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు యత్నించిన ఎనిమిది మంది ఐసిస్ ఉగ్రవాదులు చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా ఉగ్రవాద ఖైదీలు జైలు నుంచి తప్పించుకునే యత్నం చేయడంతో జైలు సిబ్బంది అదనపు బలగాలను రప్పించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరంతరం సిసికెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఖైదీలో కదిలికలపై నిఘా పెంచి, ఎప్పటికప్పుడు జైలుశాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్టు జైలు అధికారులు తెలిపారు. జైలు నుంచి ఉగ్రవాద ఖైదీలు పరారయ్యేందుకు యత్నించారనడాన్ని జైళ్లశాఖ డిజిపి వికె సింగ్ ఖండించారు.
చంచల్‌గూడ జైలు నుంచి ఉగ్రవాద ఖైదీలు ఎవరూ తప్పించుకుని పారిపోయేందుకు యత్నించలేదిన జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ వికె సింగ్ తెలిపారు. జైలు వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. ఖైదీలలో మార్పు తేవడమే తమ లక్ష్యమని, జైలు నుంచి పారిపోయే అంతటి ఖైదీలు ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. జైలులో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు.