రాష్ట్రీయం

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 21: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. సుమారు 98 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా గురువారం 862.40 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 103.47 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాల నుండి 94,454 క్యూసెక్కులు, రోజా నుంచి 4,479 క్యూసెక్కులు కలిపి మొత్తం 98, 933 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుకుంటోంది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం సాగర్‌కు 59,651 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ద్వారా నీరు విడుదల చేస్తున్నారు.