రాష్ట్రీయం

మీ కృషి అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని భూ వివాదాలు కొలిక్కి వస్తుండటంతో రైతన్నలు ఊరట పొందుతున్నారని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి ప్రారంభమైన భూ రికార్డుల ప్రక్షాళన ఆశించిన లక్ష్యానికి అనుగుణంగా సాగుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. రెవిన్యూ అధికారులు ఎంతో చిత్తశుద్ధితో, అంకితభావంతో భూ రికార్డులను సరిచేయడానికి ఎండా వానా లెక్కచేయకుండా కృషి చేస్తున్నారని అభినందిస్తూ, త్వరలో వీరికి నగదు ప్రోత్సహం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం భూ రికార్డుల ప్రక్షాళనలో వారం రోజుల పురోగతిపై భూ రికార్డుల ప్రక్షాళన మిషన్ ప్రత్యేకాధికారి వాకాటి కరుణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతీ భూ రికార్డును పరిశీలించడానికి రెవిన్యూ సిబ్బంది పడుతున్న కష్టం వెలకట్టలేమని కితాబునిచ్చారు. దీనివల్ల రైతులకు ఎంతో ఊరట, ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్రామాల్లో ఇప్పటికే 82 శాతానికి పైగా భూ రికార్డుల పట్ల స్పష్టత వచ్చిందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో వివాదాలకు తావులేకుండా స్పష్టత రావడం హర్షనీయమని కెసిఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియతో గ్రామం పరిధిలో ఏ భూమికి ఎవరు యజమానులో తేలుతుందన్నారు. విదేశాల్లో ఉన్న వారు కూడా తమకు సంబంధించిన భూముల రికార్డులు పంపిస్తే పరిశీలించి యాజమాన్య హక్కులపై స్పష్టత ఇస్తామన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలు నాలుగైదు రోజులలో ఖరారు చేస్తామన్నారు. రాష్ట్రంలో 568 రెవిన్యూ మండలాల్లోని 10,875 గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని, 1468 రెవిన్యూ బృందాలు పని చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 1.78 కోట్ల సర్వే నంబర్లు ఉండగా 75.54 లక్షల ఖాతాల్లోని 2.45 కోట్ల ఎకరాలకు సంబంధించిన రికార్డుల ప్రక్షాళన చేయాలని సంకల్పించినట్టు కెసిఆర్ చెప్పారు. మొదటి విడతలో 1252 గ్రామాల్లోని 30.04 లక్షల ఎకరాల భూ రికార్డుల పరిశీలన జరుగుతుందన్నారు. వీటిలో ఇప్పటికే 11.55 లక్షల ఎకరాలు పరిశీలించి 9.48 లక్షల ఎకరాలకు రైతుల సమ్మతితో యాజమాన్య హక్కులు కల్పించామన్నారు. మొదటి విడత చేపట్టిన భూ రికార్డుల పరిశీలనలో 82.10 శాతం పూర్తి అయిందన్నారు. వివాదాల్లోని భూ రికార్డులను పార్ట్ ‘ఎ’లో సవరించి, హద్దులు, వారసత్వ వివాదాలున్న వాటిని పార్ట్ ‘బి’లో సరిచేస్తారన్నారు. పార్ట్ ‘ఎ’ డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేసి. తర్వాత పార్ట్ ‘బి’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు. పార్ట్ ఎ పూర్తి అయిన తర్వాత స్పష్టత వచ్చిన భూములకు కొత్త పాసు పుస్తకాలను జారీ చేస్తామన్నారు. సవరించిన రికార్డుల ఆధారంగానే వచ్చే ఏడాది మేనుంచి వ్యవసాయానికి ఉచిత పెట్టుబడిని సమకూరుస్తామన్నారు. మొదటి విడతలో ఎకరానికి నాలుగు వేలు చొప్పున మే 15వరకు, రెండో విడతను అక్టోబర్ 15లోగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు.
హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో జరుగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. సామాజిక మధ్యామాలను కూడా భూ రికార్డుల ప్రక్షాళనకు వినియోగించుకుంటామని సిఎం చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా ఫేస్ బుక్ అకౌంట్ త్వరలో తెరుస్తామని వెల్లడించారు.

చిత్రం..ప్రగతి భవన్‌లో భూ రికార్డుల ప్రక్షాళన ప్రగతిపై సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్