రాష్ట్రీయం

ఆరోగ్య శ్రీలోకి ఆయుష్ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆరోగ్య శ్రీ పరిధిలో ఆయుష్ వైద్యాన్ని చేర్చాలని యోచిస్తున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి అన్నారు. అలోపతి వైద్యానికి ధీటుగా రాష్ట్రంలో ఆయుష్ వైద్య విధానాలను బలోపేతం చేయడానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో త్వరలో కొత్తగా ఐదు ఆయుష్ ఆస్పత్రులను ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఆయుష్ పరిధిలోకి వచ్చే ఆయుర్వేదం, హోమియో, యునాని వైద్యాలను ప్రజలకు చేరువ చేసి క్షేత్రస్థాయికి విస్తరించడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆయుష్ వైద్యుల సదస్సు శుక్రవారం శంషాబాద్‌కు సమీపంలోని చిన జీయర్ స్వామి ఆశ్రమంలో (జీవ కాంప్లెక్స్) జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సనాతన భారతీయ వైద్య విధానాలకు ఇటీవల ప్రజల నుంచి ఆదారణ క్రమేపీ పెరుగుతూ వస్తుందన్నారు. ఏటా ఆయుష్ వైద్యానికి 27 శాతం వృద్ధి కనిపించడం మంచి పరిణామన్నారు. భారతీయ వైద్య విధానాలు ఇంతకాలం నిర్లక్ష్యానికి గురికాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాయన్నారు. కేంద్రం ఆయుష్‌కు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆయుర్వేదం, హోమియో, యునాని ఆస్పత్రుల్లో 86 లక్షల మంది రోగులు ఔట్ పేషంట్‌గా, 40 వేల మంది ఇన్ పేషంట్‌గా చికిత్స పొందడమే ఆయూష్ ఆదరణకు నిదర్శనమన్నారు. రాష్టవ్య్రాప్తంగా 500 ఆస్పత్రులను వెల్‌నెస్ సెంటర్లుగా మార్చి వీటిలో అలోపతి వైద్యంతోపాటు ఆయూష్ వైద్యాన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకవస్తామన్నారు. ఆయూష్ వైద్యానికి ప్రజల ఆదరణ లేదన్న అభిప్రాయం నుంచి వైద్యులు బయటపడాలన్నారు. ఆయూష్ వైద్యుల్లో మొదట ఆత్మవిశ్వాసం పెరుగాల్సిన అవసరం ఉందని మంత్రి పిలుపునిచ్చారు. అలోపతి, ఆయుర్వేదం, హోమియో, యునాని వైద్యులు అందరితో ఒక కమిటీ ఏర్పాటుచేసి, ఏ వైద్య విధానంలో ఏ రోగానికి మంచి చికిత్స ఉందో పరస్పరం రిఫర్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సదస్సును జ్యోతి ప్రజల్వనతో ప్రారంభించిన శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి మాట్లాడుతూ అలోపతికి ప్రత్యామ్నాయంగా భారతీయ వైద్య విధానాలను పరిగణించడం సబబు కాదన్నారు. అలోపతి వైద్యానికి మాతృక భారతీయ వైద్య విధానమైనని స్వామిజీ అన్నారు. శస్త్ర చికిత్స వైద్యానికి ఆధ్యుడైన చరక సంహితుని ఫోటో అమెరికాలో ఒక ఆధునాతనమైన హాస్పిటల్‌లో చూసి ఆశ్చర్యపోయాయని స్వామిజీ అన్నారు. సకల వైద్య విధానాలకు భారతీయ వైద్య విధానాలే మూలాధారం అనడానికి ఇదే నిదర్శనమన్నారు. వైద్య చికిత్సలలో సాంకేతిక పరికరాల వినియోగం పెరిగాక రోగికి, వైద్యునికి మధ్య సంబంధాలు తగ్గిపోయాయన్నారు. రోగితో వైద్యుడు మాట్లాడితేనే సగం వ్యాధి నయమవుతుందని స్వామిజీ అన్నారు. ప్రజల జీవన విధానాలు, ఆహార అలవాట్లు మారడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయన్నారు. సంప్రదాయ ఆయూష్ వైద్య విధానాలను బలోపేతం కావడానికి వైద్యులతో పాటు ప్రభుత్వాలు కూడా మరింత కృషి చేయాలని స్వామిజీ పిలుపునిచ్చారు. తమ ఆశ్రమంలో హోమియోతో పాటు ఆయుర్వేద వైద్యాన్ని అందుబాటులోకి తీసుకవస్తామన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి మాట్లాడుతూ ఆయూష్ వైద్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా త్వరలోనే ఈ విభాగంలో 1600 వైద్యుల, పారా మెడికల్ పోస్టుల భర్తీ చేయబోతున్నామన్నారు. కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ, అలోపతి వైద్యంలో నయం కాని రోగులే ఆయూష్ వైద్యాన్ని ఆశ్రయిస్తారన్నారు. అయితే ఆయూష్ వైద్యాలను అలోపతి ఆస్పత్రులలో ఏర్పాటు చేయడం వల్ల రోగులకు నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. ఆయూష్ ఆస్పత్రులను అలోపతి ఆస్పత్రులలో కాకుండా విడిగా ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వినోద్ అభిప్రాయపడ్డారు. ఆయూష్ కమిషనర్ డాక్టర్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ, అలోపతి వైద్యానికి నయం కాని మొండి వ్యాధులకు కూడా ఆయూష్‌లో మంచి వైద్యం ఉందన్నారు. డేంగ్ వ్యాధిని ఆయూష్ వైద్యంతోనే నయం చేయగలిగామన్నారు. అలోపతిలో నయం కానీ దీర్ఖకాలిక రోగాలకు ఆయూష్ విధానాల్లో మంచి చికిత్సలు ఉన్నాయన్నారు. త్వరలో ఆయూష్ ఆధ్వర్యంలో ఫార్మసీ కోర్స్‌ను ప్రవేశపెట్టబోతున్నామని కమిషనర్ రాజేందర్‌రెడ్డి వివరించారు. ఆయూష్, ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను ఈ సందర్భంగా మార్చుకున్నారు.

చిత్రం..ప్రభుత్వ ఆయుష్ వైద్యుల సదస్సులో మాట్లాడుతున్న వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి