రాష్ట్రీయం

పలు రైళ్లకు షాద్‌నగర్, వికారాబాద్‌లో తాత్కాలిక నిలుపుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: చెగూర్‌లో జరిగే అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమావేశానికి హాజరయ్యే ప్రయాణీకుల సౌకర్యార్థం షాద్‌నగర్, వికారాబాద్ స్టేషన్లలో కొన్ని రైళ్లకు తాత్కాలిక నిలుపుదల సౌకర్యాన్ని కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. షాద్‌నగర్ స్టేషన్‌లో ఈ నెల 25, 26, 27 తేదీల్లో తిరుపతి-సికింద్రాబాద్ సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్, కెఎస్‌ఆర్ బెంగళూరు కాచిగూడ, చెన్నై ఎగ్మూర్ కాచిగూడ, సంపర్క్‌క్రాంతి, యశ్వంత్‌పూర్-ఇండోర్, తిరుపతి-అమరావతి, యశ్వంత్‌పూర్-కోర్భా, యశ్వంత్‌పూర్-లక్నో, నాగర్‌కోయిల్ -కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలిక నిలుపుదల కల్పించినట్లు తెలిపింది. షాద్‌నగర్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో కాచిగూడ-చెన్నై ఎగ్మూర్, కాచిగూడ-బెంగళూరు, కాచిగూడ-మదురై, హజరత్‌నిజాముద్దీన్-యశ్వంత్‌పూర్, హజరత్‌నిజాముద్దీన్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుదల చేస్తున్నట్లు తెలిపింది. వికారాబాద్ స్టేషన్‌లో ఈ నెల 25, 26, 27 తేదీల్లో కోణార్క్, రాజ్‌కోట్-సికింద్రాబాద్, పోరుబందర్-సికింద్రాబాద్, తిరుపతి-సాయినగర్‌షిర్డి ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపుతున్నట్లు తెలిపింది. 29, 30 తేదీల్లో కోణార్క్, రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లకు ఈనిలుపుదల సౌకర్యం కల్పిస్తున్నట్లు ద.మ.రైల్వే స్పష్టం చేసింది.