ఆంధ్రప్రదేశ్‌

బ్రహ్మచారిణిగా శ్రీశైల భ్రమరాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 22: శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం శ్రీ భ్రమరాంబ అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లకు మయూర వాహన సేవ నిర్వహించారు. ఉదయం అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చనలు, విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం నిర్వహించారు. అమ్మవారి ఆలయమార్గంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మందిరంలో శ్రీ భ్రమరాంబాదేవిని బ్రహ్మచారిణిగా అలంకరించిన ఆలయ అర్చక వేదపండితులు నవరాత్రి పూజలు విశేషంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మయూర వాహనంపై ఆశీనులను చేయించి పూజలు నిర్వహించారు. రాత్రి మేళతాళాలు, ఉత్సవం ముందుభాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన నృత్య, కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఈ విశేష కార్యక్రమంలో ఈవో నారాయణ భరత్‌గుప్తా దంపతులు, ఆలయ ఎఇఓ కృష్ణారెడ్డి, సిఇ రామిరెడ్డి, ఆలయ అర్చక వేదపండితులు పాల్గొన్నారు. శనివారం భ్రమరాంబాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్వామి, అమ్మవార్లకు రావణ వాహనసేవ నిర్వహిస్తారు.

చిత్రం..బ్రహ్మచారిణి అలంకారంలో భ్రమరాంబ