రాష్ట్రీయం

దేశంలోనే తెలంగాణ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలో ముందంజలో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ చెప్పారు. శుక్రవారం నాడు సచివాలయంలో భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన శ్రీలంక జర్నలిస్టుల బృందంతో సిఎస్ సమావేశమయ్యారు. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్‌లో విభిన్న మతాలు, ప్రాంతాల ప్రజలు ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో జీవిస్తున్నారని, చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. భారతదేశంలోనే హైదరాబాద్ ఐదో అతి పెద్ద నగరమని అన్నారు. దేశంలో పోలీసింగ్ వ్యవస్థ, చట్టాలు, శాంతి భద్రతల అంశాలు, నియామకం, శిక్షణ తదితర అంశాలను చర్చించారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంతో మంది యాత్రికులు శ్రీలంకను సందర్శించారని, ఎంతో మంది కాంట్రాక్టర్లు వివిధ అభివృద్ధి పనుల నిర్మాణాలను చేపడుతున్నారని అన్నారు. సాహిత్య, వాణిజ్య, ఆర్ధిక పరంగా శ్రీలంకతో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని వివరించారు. శ్రీలంకకు చెందిన 17 మంది సీనియర్ ఎడిటర్లు, జర్నలిస్టుల బృందం భారత్‌లో ఈ నెల 23 వరకూ పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా వారు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఎన్‌ఆర్‌ఎస్‌ఎ, ఐఎస్‌బి, గోల్కొండ కోట, రామోజీ ఫిలింసిటీ సందర్శిస్తారు.

చిత్రం..శుక్రవారం సచివాలయంలో సిఎస్ ఎస్‌పి సింగ్‌తో సమావేశమైన శ్రీలంక జర్నలిస్టులు