రాష్ట్రీయం

అంగరంగ వైభవంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 23: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రారంభమైన వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడవాహనం రోజున స్వామివారికి అలంకరించే పట్టువస్త్రాలను ప్రభుత్వం తరపున శనివారం సిఎం చంద్రబాబు సమర్పించారు. శనివారం సాయంత్రం 6.52కు తిరుమలలోని పద్మావతి అతిథిభవనానికి చేరుకున్న సిఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి సంప్రదాయ దుస్తులు ధరించి 7.35కు పట్టువస్త్రాలు పట్టుకుని శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆంజనేయ స్వామి ఆలయం ముందు సిఎంకు తలపాగా చుట్టి ఆయన తెచ్చిన పట్టువస్త్రాలను వెండి పళ్లెంలో ఉంచి తలపై పెట్టారు. అక్కడ నుంచి మంగళవాయిద్యాల మధ్య గజరాజులు, అశ్వ దళాలు ముందుకు కదులుతుండగా సిఎం దంపతులు పట్టు వస్త్రాలతో మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. రాత్రి 8.09కు మూలవిరాట్టు కొలువుదీరి ఉన్న సన్నిధిలోకి తీసుకువెళ్ళారు. అక్కడ తాను తెచ్చిన వస్త్రాలను సిఎం అర్చక స్వాములకు అందించారు. ఆ వస్త్రాలను స్వామివారి పాదాల చెంత ఉంచిన అర్చకులు కర్పూర హారతులు పట్టారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళామాతను దర్శించుకుని సంపంగిప్రాకారం చుట్టూ విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని సబేరాగదిలో స్వామివారి దుస్తులను కళ్లకు అద్దుకుని హుండీలో కానుకలను సమర్పించారు. అక్కడ నుంచి బయలుదేరి ధ్వజస్థంభానికి నమస్కరించుకుని రంగనాయక మండపం చేరుకున్నారు. మండపంలో టిటిడి ఇ ఓ అనిల్ కుమార్ సింఘాల్, జె ఇ ఓ శ్రీనివాసరాజు, పోలభాస్కర్, సివి ఎస్వో ఆకె రవికృష్ణ ముఖ్యమంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి 2008 డైరీ,క్యాలెండర్‌లను ఆవిష్కరించారు. నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను ఇ ఓ ముందుగా ముఖ్యమంత్రికి అందించారు.