రాష్ట్రీయం

మళ్లీ.. ఆ ముగ్గురే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 23: ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జాతీయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర కమిటీలను అధినేత చంద్రబాబు శనివారం ప్రకటించారు. గతంలో పొలిట్ బ్యూరో సభ్యులుగావున్న ఎర్రబెల్లి దయాకర్, రమేష్ రాథోడ్ స్థానంలో రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్కను తీసుకున్నామన్నారు. నందమూరి హరికృష్ణ పొలిట్ బ్యూరోలో కొనసాగుతారని శనివారం మీడియాకు వెల్లడించారు. ఏపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి తిరిగి ఎంపికకాగా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఏపి సిఎం చంద్రబాబు కొనసాగారు. జాతీయ అధికార ప్రతినిధి స్థానం నుంచి విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమను తప్పించగా, చాలాకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించని హరికృష్ణను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా మళ్లీ అవకాశమిచ్చారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వైకాపా నుంచి వచ్చిన మరో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పార్టీ యువనేత కేశవ్‌కు కొత్తగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవులు దక్కాయి. జాతీయ కమిటీలో ఐదుగురు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. పొలిట్ బ్యూరోలో 16మంది సభ్యులు, ఏపి రాష్ట్ర కమిటీలో ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు ప్రధాన కార్యదర్శులు, 7గురు అధికార ప్రతినిధులు, 38మంది కార్యనిర్వహక కార్యదర్శులు, 40మంది కార్యదర్శులు ఉన్నారు.
జాతీయ కమిటీ ఉపాధ్యక్షులుగా కె నారాయణ, డికె సత్యప్రభ, గరికపాటి మోహన్‌రావు, మాగుంట శ్రీనివాసరెడ్డి, సండ్ర వెంకటవీరయ్య; ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, ఇ పెద్దిరెడ్డి, ఎంఏ షరీఫ్, కె రామ్మోహన్‌నాయుడు; కోశాధికారిగా శిద్దా రాఘవరావు; కార్యాలయ సమన్వయ కార్యదర్శిగా టిడి జనార్దన్‌రావు; ప్రోగ్రాం కమిటీ కన్వీనర్‌గా వివివి చౌదరి; క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా తోట నరసింహం, సభ్యులుగా బక్కని నర్శింహులు, పిఎస్ మునిరత్నం; అధికార ప్రతినిధులుగా సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్‌రావు, కొత్తకోట దయాకర్‌రెడ్డి, గల్లా జయదేవ్, అరవిందకుమార్‌గౌడ్; మీడియా కన్వీనర్‌గా ఎల్వీఎస్సార్కె ప్రసాద్ నియమితులయ్యారు.
పొలిట్ బ్యూరో సభ్యులుగా చంద్రబాబు, అశోక్‌గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కెఇ కృష్ణమూర్తి, హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, దేవేందర్‌గౌడ్, ఉమామాధవరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్శింహులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రతిభాభారతి, అయ్యన్నపాత్రుడు, నామా నాగేశ్వర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్క నియమితులయ్యారు.

చిత్రాలు..కళా వెంకట్రావు* ఎల్ రమణ *చంద్రబాబు