రాష్ట్రీయం

ఎందుకంత అక్కసు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: ప్రకృతి కరుణించి కృష్ణమ్మ శ్రీశైలందాకా రావటంతో పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లిస్తుంటే ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మీడియాలో రెచ్చగొట్టే రాతలు రాస్తున్నారని జల వనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. శనివారం రాత్రి విజయవాడలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజుకు లక్షా 64వేల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోందన్నారు. దీంతో రాయలసీమకు నీళ్లిస్తుంటే జగన్ మీడియాలో ‘తోడటం మొదలు పెట్టారని’ రాస్తూ పక్క రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలకు మేలు జరుగుతున్నా ఓర్వలేక ఈ విధమైన రాతలు రాస్తున్నారన్నారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోపక్క అక్టోబర్ మొదటి తేదీ నాటికి కడప జిల్లాకు నీళ్లు ఇవ్వకపోతే ధర్నా చేస్తానని హెచ్చరించటం శోచనీయమన్నారు. జగన్ చేస్తున్న పనులను వివరించాల్సిన అవసరం మంత్రిగా తనపై ఉందన్నారు. అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి కోరినట్టుగా చాగల్లు రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రితో మాట్లాడి శాశ్వత పరిష్కారంగా జీవో ఇచ్చి నీళ్లు విడుదల చేస్తామన్నారు. నాగార్జునసాగర్ కింద ఉన్న మెట్ట ప్రాంత రైతుల సమస్యలు తనకు బాగా తెలుసని, మెట్ట ప్రాంతాల్లో రైతులు నీళ్లులేక పడే ఇబ్బందులు స్వయంగా చూశానన్నారు. గోదావరి, పెన్నా అనుసంధానానికి లైడర్ సర్వే పూర్తిచేస్తామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటికే గోదావరిద్వారా 792 టిఎంసిలు సముద్రంలోకి వెళ్లాయని, ఇందులో కొన్ని నీళ్లు రాయలసీమకు ఇచ్చి దానిని రతనాల సీమగా మార్చడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అనంతపురం, చిత్తూరు, కడపకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ వైడనింగ్ పనులు చేస్తున్నాం
కాబట్టి నీళ్లు ఇవ్వగలుగుతామన్నారు. పులివెందులకు నీళ్లు ఇచ్చి పరిష్కార మార్గం చూపించామన్నారు. పట్టిసీమద్వారా ఇప్పటికి 61.5 టిఎంసిల నీళ్లు రాబట్టి.. హంద్రీనీవా ద్వారా, నాగార్జునసాగర్ రైట్ కెనాల్ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు మంచినీళ్ల అవసరాలకు 6 టిఎంసిలు నీళ్లు విడుదల చేయగలిగామన్నారు. పట్టిసీమ ద్వారా తీసుకొచ్చిన నీళ్లవల్ల 10 లక్షల 70వేల ఎకరాలకు, రెండు లక్షల ఎకరాల ఆక్వా రైతుల అవసరాలతోపాటు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తాగునీటి అవసరాలు తీర్చామన్నారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించామన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నిర్వాసితులకు న్యాయం చేయడానికి ప్రతి శనివారం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారన్నారు. వంశధార ద్వారా 48 టిఎంసిలు సముద్రంలో పోయాయని, వంశధార ఫేజ్-2 పూర్తయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో నీటి అవసరాలు తీర్చటానికి ఆస్కారం ఉంటుందన్నారు.