రాష్ట్రీయం

ఊరు ఖాళీ చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, సెప్టెంబర్ 23: పరిహారం చెల్లించకుండా మిడ్ మానేరులో నీటిని నింపి నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ బాధితులు సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. శనివారం మిడ్ మానేరులోకి ఎస్సారెస్పీ నుంచి నీటిని వదలడంతో జలాశయంలోకి క్రమంగా నీరు చేరుతున్న నేపథ్యంలో ముంపు గ్రామం తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ నుండి నిర్వాసితులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమకు పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టులోకి నీటిని వదలి గ్రామాలను ముంచివేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పరిహారం చెల్లించి, పునరావాస కాలనీల్లో పూర్తి స్థాయిలో వౌలిక వసతులు కల్పించే వరకు మధ్య మానేరు జలాశయం నింపడాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాలలో ఏ గ్రామానికీ జరగనంత అన్యాయం చీర్లవంచ ప్రజలకు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని భయాందోళనకు గురిచేస్తూ, అధికారులు బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పరిహారం చెల్లించే వరకు ఊరు ఖాళీ చేయబోమని, ప్రభుత్వం తమను చంపాలనుకుంటే నీటిలోనే ముంచాలని ఆవేదన వ్యక్తం చేశారు. సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని చెబుతున్న అధికారులు, ప్రభుత్వం పురనావాస కాలనీల్లో ఎలాంటి వసతులు పూర్తి చేయలేదన్నారు. కనీసం మంచినీటి సౌకర్యం లేదని, కరెంటు లేదని, కాలనీల్లో నివాసాలే పూర్తి కాలేదని ఈ స్థితిలో సురక్షిత ప్రాంతం అంటే ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నించారు. మధ్య మానేరును రెండు టి ఎంసి నీటితో నింపాలని చూస్తున్న ప్రభుత్వం, పరిహారం ఇచ్చాక నీటిని నింపాలన్నారు. స్వచ్ఛందంగా చీర్లవంచ ముంపు నిర్వాసితులు తరలి రావడంతో బిజెపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు, వైసిపి జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము తదితర నేతలు మద్దతుగా ఆందోళనలో పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అయితే ఆందోళన ఉధృతం కావడంతో పోలీసు బలగాలు రంగప్రవేశం చేశాయి. ఆందోళనకారుల వద్దకు కలెక్టర్ కృష్ణ్భాస్కర్ రావడంతో సమస్య తీవ్రతపై వినతిపత్రం సమర్పించి, వెంటనే ప్రాజెక్టులోకి నీటిని వదలడం ఆపాలని, పరిహారం చెల్లింపులు, ప్యాకేజీలు ఇచ్చాకే గ్రామాన్ని ఖాళీ చేయించాలని కోరారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, పరిహారం చెల్లించకుండా దాదాపు కొన్ని సంవత్సరాల నుండి అధికారులు వేధిస్తున్నారని అన్నారు. నకిలీ రిపోర్టులు చూపించి ఇబ్బందులు పెడుతున్నారని, కుటుంబ ప్యాకేజీలు చెల్లించలేదని, 18 సంవత్సరాలు నిండి ఎంతోమంది యువకులను రికార్డుల్లో లేకుండా చేశారని, ఆఖరి సమయంలో గ్రామంలోకి వచ్చిన అధికారులు ఇండ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీటిని వదిలారని, దీని వల్ల తమకు ప్రమాదం ముంచుకొచ్చిందని, ఇపుడు తాము ఎక్కడికి వెళ్ళాలని అన్నారు. పునరావాస కాలనీల్లో తమ ఇండ్లు నిర్మాణం పూర్తి కాలేదని, డబ్బులు లేవని, ఇపుడు ఏమి చేయాలని ప్రశ్నించారు. తాము ప్రభుత్వానికి సహకరిస్తామని, అయితే తమ సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్టర్లకు ఇచ్చిన విలువ తమ నిర్వాసితులకు ఇవ్వడం లేదని ఆరోపించారు.

చిత్రం..కలెక్టర్‌కు గోడు విన్నవించుకుంటున్న మిడ్ మానేరు నిర్వాసితులు