రాష్ట్రీయం

పాలమూరుకు గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయ పర్యావరణ ప్రభావ నివేదిక తయారీకి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. కేందపర్యావరణ సలహా సంఘం సమావేశంలో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పరిశీలించి విధి విధానాలను జారీ చేసేందుకు అంగీకరించినట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మూడు సీజన్లలో పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక తయారు చేసి పర్యావరణ మంత్రిత్వ శాఖకు అంద చేస్తారు. ఈ నివేదిక రూపొందించేందుకు ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టవచ్చును. మొట్టమొదట నార్లాపూర్ నుంచి ఉద్ధండాపూర్ వరకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు మాత్రమే ఈ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తారు. తాగునీటి పనుల కోసం పర్యావరణ అనుమతులు అవసరం లేదు. పర్యావరణ, అటవీ అనుమతులు వచ్చిన తర్వాత సాగునీటి సరఫరాకు సంబంధించి పనులు చేపడుతారు.
ఈ ప్రాజెక్టు వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడు లక్షల ఎకకరాలు, రంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలు, మోత్తం 12.30 లక్షల ఎకరాలు, మొత్తం 72 మండలాల్లో 1131 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది. నార్లాపూర్ వద్ద 8.51 టిఎంసిలు, ఏదుల వద్ద 6.55 టిఎంసిలు, వట్టెం వద్ద 16.74 టిఎంసిలు, కరివెన వద్ద 17.34 టిఎంసిలు, ఉద్దండాపూర్ వద్ద 15.91 టిఎంసిలు, లక్ష్మీదేవి పల్లి వద్ద 2.80 టిఎంసిల నిలువ సామర్ధ్యంతో 67.85 టిఎంసిలను డ్రా చేస్తారు. ముంపు 49 వేల ఎకరాలకు, 3 గ్రామాలు, 20 తండాలు, 2781 ఆవాసాలకు పరిమితమవుతుంది. రీ డిజైన్ ద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ముంపు గణనీయంగా తగ్గిపోయింది. ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ప్రభుత్వం
2016 జూన్ 10వ తేదీన ప్రాజెక్టు రూ.35,200 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రాజెక్టు పనులను 18 ప్యాకేజీలుగా విభజించి తాగునీటి సరఫరా కోసం ప నులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ పర్యావరణ అనుమతి ఇవ్వడం పట్ల సాగునీటిశాఖ మంత్రి హరీష్ రావు కేంద్రానికి కృతజ్ఞత తెలిపారు. చాలాకాలంగా అటకెక్కి దుమ్ముపట్టిపోయిన పాలమూరు రంగారెడ్డి దస్త్రాన్ని తెలంగాణ ప్రభుత్వం బయటకు తీసి, మొదటి దశ పర్యావరణ అనుమతి సాధించడంతో రాష్ట్ర ప్రజల్లో హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసేందుకు ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్‌కు అనుబంధమైన ఇంజనీరింగ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియాకు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇందుకోసం రూ.5.71 కోట్లను మంజూరు చేస్తూ 2014 ఆగస్టులో జీవో జారీ చేసింది. ఆరునెలల తర్వాత ఎస్కే వారు ముసాయిదా నివేదిక అందచేసింది.
జూరాల జలాశయం నుంచి 35 రోజుల పాటు రోజుకు 2 టిఎంసిలను ఎత్తిపోసి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏడు లక్షలు, రంగారెడ్డి జిల్లాల్లో 2.7 లక్షలు, నల్లగొండ జిల్లాల్లో 30 వేల ఎకరాలు మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీరు, జంటనగరాలతో పాటు దారి పొడుగున గ్రామాలకు మంచినీరు, పరిశ్రమల అవసరాలకు నీరు అందించవచ్చని నివేదికలో పేర్కొన్నారు. కోయిల కొండ వద్ద 76 టిఎంసిలు, గండీడ్ వద్ద 35 టిఎంసిలు, లక్ష్మీదేవిపల్లి వద్ద 10 టిఎంసిల నిల్వ సామర్ధ్యం కలిగిన జలాశయాల నిర్మాణం ఉన్నాయి. మూడు జలాశయాల్లో 47 గ్రామాలు, 84,400 మంది జనాభా, 16342 ఆవాసాలు ముంపు బారిన పడుతాయని నివేదిక ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా సర్వే ఇండియా వారి టోపో మ్యాపులు, గూగుల్ ఎర్త్ సాఫ్ట్‌వేర్, జూరాల, శ్రీశైలం వరద ప్రవాహాల గణాంకాల సాయంతో కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ముంపును గణనీయంగా తగ్గించగలిగే అవకాశం ఉంది. జూరాల నుంచి కాకుండా 215 టిఎంసిల నిల్వ సామర్ధ్యం కలిగిన శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 1.50 టిఎంసిల నీటిని 90 రోజుల పాటు ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉందని నిపుణులు తెల్చారు. తుంగభద్ర నీళ్లు కూడా శ్రీశైలం జలాశయానికి చేరుతాయి. దీంతో జూరాలకు బదులుగా శ్రీశైలం జలాశయం వనరుగా ప్రాజెక్టును రి డిజైనఖ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నక్కల గండి ప్రతిపాదనలో ముంపు భారీగా ఉండడంతో ప్రత్యామ్నాయాలను పరిశీలించారు. రెండు ప్రాజెక్టుల నీటి వనరు శ్రీశైలం జలాశయమే అయినందున, ఈ రెండు ప్రాజెక్టులకు ఒకే ఇన్ టేక్ ద్వారా నీటిని సరఫరా చేయడం సాంకేతికంగా సాధ్యమేనని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. రీ డిజైన్ తర్వాత ప్రాజెక్టు ప్రతిపాదనల్లో నీటి సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి మార్చడం, ఆరు కొత్త జలాశయాలను ప్రతిపాదించడం, ఆయకట్టు పది లక్షల ఎకరాల నుంచి 12.30 లక్షల ఎకరాలకు పెంచడం, ముంపును గణనీయంగా తగ్గించడం వంటి కీలకమైన మార్పులను ప్రభుత్వం చేసినట్లు ఈ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ లింగరాజు తెలిపారు.