రాష్ట్రీయం

శ్రీశైల భ్రమరాంబకు చంద్రఘంట అలంకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 23: శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు శనివారం ఆదిపరాశక్తి, శక్తి స్వరూపిణి అయిన శ్రీభ్రమరాంబదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమల్లికార్జునస్వామి, అమ్మవారు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి తలపై అర్ధచంద్రాకారంలో చంద్రుడు ఘంటాకారంలో అలరారుతుంటాడు కాబట్టే చంద్రఘంటదేవిగా నామకరణం చేశారు. రౌద్రరూపంతో పది చేతుల్లో అస్త్రాలను కలిగి చంద్రధ్వనులతో అమ్మ రాక్షసులను సంహరించి దైత్యులను అణచివేసిందని వేదాలు చెబుతున్నాయి. చంద్రఘంట దేవిని అత్యంత భక్తితో పూజిస్తే భయాలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. చంద్రఘంట దేవిగా అలంకరించిన అమ్మవారికి ఆలయ అర్చక వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రావణ వాహనం ఆశీలనుచేసి పూజల అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆది దంపతులను దర్శించుకుని పునీతులయ్యారు. గ్రామోత్సవంలో కళాకారుల విన్యాసాలు అబ్బురపరిచాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఆదివారం కూష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్లకు కైలాస వాహనసేవ నిర్వహిస్తారు.