రాష్ట్రీయం

ధార్మిక పరిషత్తుకు తుది మెరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించిన ‘్ధర్మిక పరిషత్’ ఏర్పాటుకు తుదిమెరుగులు దిద్దుతున్నారని తెలిసింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో ధార్మిక పరిషత్ ఏర్పాటు ప్రధానమైంది. ధార్మిక పరిషత్ ఏర్పాటుకు సంబంధించి గతంలోనే ఎండోమెంట్స్ కమిషనరేట్ నుండి ఒక ఫైలు దేవాదాయ మంత్రి ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయనికి వెళ్లిందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే వివిధ కారణాల మూలంగా ధార్మిక పరిషత్ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం దేవాదాయ మంత్రి స్వయంగా ధార్మిక పరిషత్ చైర్మన్‌గా పనిచేస్తారు. ఈ పరిషత్‌లో దేవాదాయ, రెవెన్యూ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పాటు వివిధ పీఠాల అధిపతులు, మఠాల అధిపతులు, దేవాలయాలకు సంబంధించిన పాలకమండళ్ల ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలోని దేవాలయాలకు సంబంధించిన పాలక వ్యవహారాలన్నీ ధార్మిక పరిషత్ పరిధిలో ఉంటాయి.
ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో ఇటీవల దేవాలయాల వ్యవహారాలపై జరిగిన కీలకమైన సమావేశంలో ఆలయాల అర్చకుల వేతనాలు, ధూపదీప నైవేద్యం పథకం తదితర అంశాలతో పాటు ధార్మిక పరిషత్ అంశం కూడా చర్చకు వచ్చింది. త్వరలోనే ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీతో ధార్మిక పరిషత్ ఏర్పాటు అంశంపై యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయి. దేవాదాయ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, రెవెన్యూ (ఎండోమెంట్స్) కార్యదర్శి ఎన్. శివశంకర్, దేవాదాయ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసులు తదితరులు ఎవరిస్థాయిలో వారు ధార్మిక పరిషత్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. అందరి సూచనల మేరకు ముఖ్యమంత్రి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఇందుకోసం వారం, పరిరోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
రాష్ట్ర విభజన తర్వాత ధార్మిక పరిషత్తు ఏర్పాటు వాయిదాపడుతూ వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, దేవాదాయ చట్టానికి 2007 లో సవరణలు చేశారు. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండగా, రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఒక పర్యాయం, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మరొక పర్యాయం ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధార్మిక పరిషత్ ఏర్పాటు కాలేదు. తెలంగాణలో ధార్మిక పరిషత్ ఏర్పాటైతే ఉభయ తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా మారుతుంది.