రాష్ట్రీయం

ఎంత కష్టమొచ్చింది!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ శ్రీశైలం/ గద్వాల, సెప్టెంబర్ 24: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలంచేసి ఆధునిక దేవాలయంగా కీర్తిని అందుకున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు, జల విద్యుత్ రంగానికి దిక్సూచిగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు భవిష్యత్తు అయోమయంలో పడిం ది. ఈ రెండూ ప్రస్తుతానికి నీటి నిల్వ చేసే డ్యాములు గా మారిపోయాయ. రానున్న రోజుల్లో మహాద్భుతం జరిగి భారీ వర్షాలు పడితే తప్ప నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వచ్చే నీటి ప్రవాహం ఏమీ ఉండదని అర్థమైపోతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వదిలే నీటిని ఒడిసిపట్టి కుడి, ఎడమ కాల్వల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు రెండు కోట్ల జనాభాకు మంచినీటిని సరఫరా మాత్రమే చేసే రిజర్వాయర్‌గా డ్యాంగా సాగర్ మారిపోయంది. ప్రస్తుత పరిస్ధితిని విశే్లషిస్తే ఈ ఏడాది నాగార్జునసాగర్ ఆయకట్టు కింద రెండు రాష్ట్రాల్లో ఉన్న 22 లక్షల ఎకరాలకు ఖరీఫ్, రబీ లేదు. ఈ విషయాన్ని కృష్ణా బోర్డు కరాఖండిగా తేల్చి చెప్పేసింది. ఈ ఏడాది జూరాల నుంచి శ్రీశైలం వరకు వచ్చిన నీటి ప్రవాహం కేవలం 150 టిఎంసి. ఇందులో ఆవిరి కింద కొంతపోను, దిగువకు విడుదల చేస్తున్న జలాల తరువాత.. ఈ రోజుకు 131 టిఎంసి ఉంది. రానున్న రోజుల్లో ఎగువున వర్షాలు కురిస్తే మరో పది టిఎంసి రావచ్చు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 215 టిఎంసికి 131 టిఎంసి, నాగార్జునసాగర్‌లో 312 టిఎంసికి కేవలం 116 టిఎంసి నిల్వలున్నాయి. శ్రీశైలంలో మొత్తం నీటిమట్టం 885 అడుగులకు 867.4 అడుగుల నీటి మట్టం ఉంది. ఆల్మట్టి నుంచి 87 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, మధ్యలో పడిన వర్షాలతో శ్రీశెలానికి 1.77 లక్షల కూసెక్కుల నీరు చేరుతోంది. దిగువకు సాగర్‌కు 57వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నీటిని హేతుబద్ధంగా ఉపయోగించడంపై కృష్ణా బోర్డు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం అక్టోబర్ 15న జరిగే మీటింగ్‌పైన రెండు రాష్ట్రాలు దృష్టి సారించాయి.
శ్రీశైలం ప్రాజెక్టుకు తుంగభద్ర జలాలు వస్తాయి. ఆ నది నీటి పరీవాహక ప్రాంతం రాయలసీమలో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడగులకు తగ్గకుండా చూడాలని కృష్ణాబోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాని ఆచరణలో అమలు సాధ్యమా? అని తెలంగాణ, ఆంధ్ర అధికారులు అంటున్నారు. 854 అడుగులకంటే దిగువకు నీటి మట్టం పడిపోయేలా నీటిని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు వినియోగిస్తే, ఏపిలోని రాయలసీమ వాసులు ఆంధ్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అనేక సీమ రైతు సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చాయి.
నాగార్జునసాగర్ నుంచి మంచినీటిని హైదరాబాద్, నల్లగొండ, రంగరెడ్డికి జిల్లాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ జిల్లాల్లో నీటి కటకట ఏర్పడింది. కృష్ణా బోర్డు ఈ జిల్లాలకు ప్రస్తుతం రెండు టిఎంసి, వచ్చే రోజుల్లో మరో టిఎంసిని విడుదల చేయాలని ఆదేశించినా, ఈ నీరు ఏమాత్రం చాలదు. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలని కోరితే ఏపి ప్రభుత్వం అంగీకరించదు. అందుకే జల విద్యుదుత్పత్తి చేసి దిగువకు నీటిని తెలంగాణ విడుదల చేస్తోంది.
కృష్ణా డెల్టాకు పట్టిసీమ నుంచి గోదావరి జలాలను సరఫరా చేయడం వల్ల అక్కడ ఉన్న పంటను ఆంధ్ర ప్రభుత్వం కాపాడింది. కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వచ్చే సరికి నీటి విడుదల నిర్వహణ తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో కొంతప్రాంతం నాగార్జునసాగర్ డ్యాంపై ఆధారాపడి ఉన్నాయి. ఈ పరిస్ధితుల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు సమష్టిగా నీటి వినియోగంపై ఒక అవగాహనకు రాని పక్షంలో తగాదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.
ఉమ్మడి ప్రాజెక్టులపై యాజమాన్య హక్కులను కృష్ణా బోర్డుకు ఇవ్వకపోవడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో లభ్యతలో ఉన్న నీటిని ఎడాపెడా రెండు రాష్ట్రాలు వాడుతుండటంతో, వచ్చే నెల రోజుల్లో 854 అడుగులకు దిగువకు నీటి మట్టం పడిపోతుంది. నాగార్జునసాగర్ పరిస్ధితి అంతే. ప్రస్తుతం నాగార్జునసాగర్ వద్ద నీటి మట్టం 590 అడుగులకు 510 అడుగులు ఉంది. శ్రీశైలంలో 854 అడుగులు, నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీటి మట్టం తగ్గకుండా చూడాలన్న కృష్ణా బోర్డు ఆదేశాలను రెండు రాష్ట్రాలు అమలయ్యేలా చూడటం కష్టంగా మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న నీరు ఈ ఏడాది అంటే 2018 జూలై వరకు రెండు రాష్ట్రాలు మంచినీటి నిమిత్తం ఉపయోగించుకోవాల్సి ఉంది.
అక్టోబర్ 15న మీటింగ్‌కు కసరత్తు
వచ్చేనెల 15న పూర్తిస్థాయ సమావేశం నిర్వహించి నీటి వినియోగం కేటాయింపులు ఖరారు చేస్తామని కృష్ణాబోర్డు పేర్కొంది. కానీ నీటి లభ్యత లేనప్పుడే కేటాయింపులు కత్తిమీద సాముగా మారింది. 2015 ఆగస్టు నెలలో కృష్ణా బోర్డు నీటి వినియోగంపై మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను తాజాగా సవరించి విడుదల చేస్తూ ఇరు రాష్ట్రాలు నీటిని మంచినీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోని పక్షంలో తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్ధితులు ఉంటాయని కూడా కృష్ణా బోర్డు నర్మగర్భంగా హెచ్చరించింది. మొత్తం 30 మార్గదర్శకాలు ఉన్నాయి. వీటిని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు పంపింది. కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పునకు లోబడి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నోటిఫై చేసే ఆపరేషన్ ప్రోటోకాల్ నిబంధనలను రెండు రాష్ట్రాలు అతిక్రమించరాదు. ఉమ్మడి ఆంధ్రలో కుదిరిన ఒప్పందాల మేరకు ప్రాజెక్టులకు నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం, నీటి వినియోగంలో తొలుత మంచీనీరు, తర్వాత సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులను నిర్మించరాదని కృష్ణాబోర్డు పేర్కొంది.

చిత్రం..కళావిహీనంగా నాగార్జున సాగర్ నీటిమట్టం