రాష్ట్రీయం

జూరాలకు కొనసాగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద కొనసాగుతుంది. ఆదివారం ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలతోపాటు, భీమా నది నుంచి వస్తున్న వరదనీటి కారణంగా జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లుతొక్కుతోంది. జూరాల జలాశయంలో 318.330 మీటర్ల స్థాయిలో నీటి నిల్వ ఉండగా ఎగువనుంచి 1,84,000 క్యూసెకుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తి 1,83,951 క్యూసెకులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టికి 88,497 క్యూసెకులు ఇన్‌ఫ్లో ఉండగా 84,435 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. నారాయణపూర్ జలాశయానికి 87,597 క్యూసెకులు ఇన్‌ఫ్లో ఉండగా 75,003 క్యూసెకుల ఔట్ ఫ్లో ఉంది.