రాష్ట్రీయం

అవకాశాలు అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 24: విదేశీ పెట్టుబడులకు రాజధాని అమరావతి స్వర్గ్ధామం కానుందని సిఎం చంద్రబాబు అన్నారు. వౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కంపెనీలు ఇక్కడికి క్యూకట్టేలా ఉన్న అవకాశాల గురించి మనం విదేశీ పెట్టుబడిదారులకు వివరించాలన్నారు. సింగపూర్‌లో ఈ నెల 25 నుంచి 27 వరకూ ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజ్ అనే సంస్థ వౌలిక సదుపాయాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి హాజరయ్యేందుకు రాష్ట్ర ఇంధన కార్యదర్శి అజయ్ జైన్ నేతృత్వంలో ఒక అధికారుల బృందాన్ని పంపేందుకు సిఎం నిర్ణయించారు. ఈనేపథ్యంలో అజయ్ జైన్, తదితర అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో అమరావతి కోసమే 1.25 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నామని గుర్తుచేశారు. సింగపూర్‌లో జరిగే సమావేశంలోనూ పెట్టుబడులను ఆకర్షించాలని, అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాల గురించి వివరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ కంపెనీలకు ఈసందర్భంగా పిలుపునిచ్చారు. ఉద్యోగావకాశాలు కల్పించి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారతదేశంలో ఏర్పాటవుతున్న తొలి గ్రీన్‌ఫీల్ట్ స్మార్ట్‌సిటీ అమరావతి అని పెట్టుబడిదారులకు తెలపాలన్నారు. అమరావతికి స్మార్ట్‌సిటీ కింద 500 కోట్ల రూపాయల నిధులను కేంద్రం దశలవారీగా విడుదల చేసేందుకు అంగీకరించిందని, మరిన్ని నిధులు కూడా వస్తాయని తెలిపారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిఎంగా ఉన్నపుడు రహేజా కంపెనీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించేందుకు ఫైల్ పట్టుకుని వెళ్లానని గుర్తుచేశారు. ఎకరా స్థలానికి 100 ఉద్యోగాలనే షరతుతో స్థలం కేటాయించడం వల్ల ఆ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్‌కు ఒక వరమైందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి జపాన్, సింగపూర్, అమెరికా దేశాల్లో గుర్తింపు లభించిందన్నారు. అమరావతిపై తన కలలకు వౌలిక సదుపాయాల కంపెనీలు తమ సృజనాత్మకతను జోడించి మరింతగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. అంతా సక్రమంగా ఉంటే ఎపిలో అనుమతులు 21 రోజుల్లో వస్తాయని తెలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీ్ధర్, తదితరులు పాల్గొన్నారు. కాగా, సింగపూర్‌లో పర్యటించనున్న బృందంలో సిఆర్‌డిఎ అదనపు కమిషనర్ రామ మనోహరరావు, ఎపి ఆర్థికాభివృద్ధి బోర్డు సిఇవో కృష్ణకిషోర్, తదితరులు ఉన్నారు.