రాష్ట్రీయం

తూ.గోలో పర్యాటక ప్రభ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 24: గోదావరి తీరంలో విరివిగా పర్యాటక ప్రాజెక్టులు విస్తరిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. సహజ సిద్ధ అందాలతో అలరారే తూర్పు గోదావరి జిల్లా గోదావరి తీర ప్రాంతంలో ఇటు పిచ్చుకలంక, అటు కోనసీమ, పాపికొండలు, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం శరవేగంగా విస్తరిస్తున్నాయి. ప్రధానంగా మంజీర సంస్థ రాజమహేంద్రవరంలో భారీ పర్యాటక ప్రాజెక్టు చేపట్టింది. రూ. 120 కోట్ల అంచనాతో భారీ పర్యాటక ప్రాజెక్టును మంజీరా సంస్థ చేపట్టింది. కనె్వన్షన్ సెంటర్, షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్‌లను నిర్మించేందుకు పనులు చేపట్టింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెంట్రల్ జైలుకు చెందిన ఆరు ఎకరాల భూమిని బదలాయింపు చేసి మంజీరా సంస్థకు అప్పగించారు. లీజు ప్రాతిపదికన భూమిని మంజీరా సంస్థకు అప్పగించారు. కనె్వన్షన్ సెంటర్, మల్టీ ఫ్లెక్సులు నిర్మించి ఐదేళ్ళ అనంతరం పర్యాటక శాఖకు అప్పగించాల్సిందిగా నిబంధన పెట్టారు. ఏడాదికి లీజు రూపేణా రూ.150 కోట్లు పర్యాటక శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది 10 శాతం పెంచి లీజు పెంపుదల చేయాల్సి వుంది. దశల వారీగా ఈ సంస్థ రూ. 120 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో అత్యున్నత ప్రమాణాలతో కనె్వన్షన్ సెంటర్ నిర్మిస్తారు. షాపింగ్ కాంప్లెక్సు, మల్టీఫ్లెక్స్ ఐమ్యాక్స్ నిర్మాణాలు చేపడుతున్నారు. మొత్తం 33 ఏళ్ళకు లీజు ప్రాతిపదికన భూమిని మంజీర సంస్థకు అప్పగించారు. అనంతరం బదలాయించే విధంగా నిబంధన రూపొందించారు. అనంతరం మరో బిడ్ పొడిగింపు విధానంలో కొనసాగించనున్నారు. రాజమహేంద్రవరంలో మొట్ట మొదటి సారిగా మల్టీఫ్లెక్స్ పర్యాటక శాఖ జాయింట్ వెంచర్‌లో రూపొందడం గమనార్హం. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టును అంతర్జాతీయ స్థాయిలో విదేశీ విమానాలు ఆగేలా అభివృద్ధి చేయడం కూడా పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని అంటున్నారు.ఇదిలావుండగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా పిచ్చుకలంక పర్యాటక ప్రాజెక్టును రూ.18 కోట్లతో భూమి సిద్ధం చేశారు. అంతర్జాతీయ పర్యాటక సంస్థలను ఆహ్వానించారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించేలా గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రముఖ ఒబెరాయ్ సంస్థ హోటళ్ల నిర్మాణంతో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకొచ్చింది. అదేవిధంగా వివిధ సంస్థలు కాటేజీలు, వాటర్ స్పోర్ట్స్, క్రీడా మైదానాలు, జెట్టీలు, హెలీప్యాడ్ నిర్మాణం, హెలీకాప్టర్ నిర్వహణ, బోటింగ్, రెస్టారెంట్లు తదితరాలు నిర్మించేందుకు ముందుకొచ్చాయి. గ్లోబల్ టెండర్ల విధానంలో వీటి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టుగా పిచ్చుకలంక మారనుంది. కడియంలో నర్సరీలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రూ. 27 కోట్లు కేటాయించారు. మొత్తం మీద తూర్పు గోదావరి జిల్లాలో వివిధ పర్యాటక ప్రాజెక్టులతో శరవేగంగా బహుముఖంగా పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది.