రాష్ట్రీయం

అటు మోదం.. ఇటు ఖేదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో జనాభా ముఖచిత్రం మారుతోంది. పని చేసేందుకు అనువుగా ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది ఆనందించదగ్గ పరిణామమే అయినా, అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం, టీనేజ్ యువత సంఖ్య తగ్గుతుండటం మరోవైపు కలవరపెట్టే అంశంగా మారింది. ఏ దేశానికి, ఏ రాష్ట్రానికైనా 20 నుంచి 35ఏళ్ల మధ్య ఉన్న యువతను డెమోగ్రాఫిక్ డివిడెండ్‌గా భావిస్తారు. యువత ఎక్కువ సంఖ్యలో ఉంటే ఆ దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుని భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎక్కువగా ఉన్నది మనదేశమే. ప్రపంచ దేశాలకు నిపుణులైన యువతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే తరహాలో రాష్ట్రంలోనూ పనిచేసేందుకు అనువైన వయస్సున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 1971లో ఆంధ్ర రాష్ట్ర జనాభా 2.77 కోట్లు కాగా, అందులో 20 నుంచి 60 ఏళ్ల వయసున్న వారి సంఖ్య 45 శాతం. 2011లో 4.9 కోట్ల జనాభాలో 54.7 శాతం జనాభా ఈ వయసు మధ్య ఉన్నారు. 2026 నాటికి ఈ సంఖ్య 59 శాతానికి చేరుకోనుందని ఓ అంచనా. అంటే రాష్ట్ర జనాభాలో 2026 నాటికి దాదాపు 60 శాతం మంది పనిచేసేందుకు అనువైన వయసులో ఉంటారు. ఇందులో సగంమంది 40 సంవత్సరాల్లోపు వయస్కులు ఉంటారని అంచనా. వీరు రాష్ట్భ్రావృద్ధిలో, ఆర్థిక ప్రగతిలో కీలకం కానున్నారు. జనాభాలో సగానికి పైగా పనిచేసేందుకు వీలుగా ఉన్నవారు కావడం రాష్ట్ర ప్రగతికి కలిసిసొచ్చే అంశం. అయితే ఇదే సమయంలో వృద్ధుల సంఖ్య కూడా పెరగనుంది. 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు 6.4 శాతంగా ఉన్నారు. 2011 నాటికి వృద్ధుల సంఖ్య 10.1 శాతానికి చేరింది. 2026 నాటికి వీరి సంఖ్య 14.6 శాతానికి పెరగనుంది. 2011 లెక్కల ప్రకారం వృద్ధుల సంఖ్య 49 లక్షలు కాగా, 2026 నాటికి 81 లక్షలకు చేరనుంది. పెరిగిన జీవన ప్రమాణాలు, అందుబాటులోకి వచ్చిన వైద్య సదుపాయాలు వంటి కారణాలతో సగటు జీవితకాలం పెరుగుతోంది. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ భవిష్యత్తులో ఈమేరకు అదనంగా ప్రభుత్వంపై పింఛన్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు విశే్లషిస్తున్నాయి. 0 నుంచి 20 ఏళ్లలోపు వారి సంఖ్య కూడా 2011లో 169 లక్షల కాగా, 2026 నాటికి ఇది 147 లక్షలకు తగ్గనుంది. దీనివల్ల విద్యకు సంబంధించి వౌలిక సదుపాయాలపై ప్రభావం పడనుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యా రంగానికి వౌలిక వసతులు కల్పిస్తే, ఒక దశలో అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉంది. దీంతో విద్యారంగంలో వౌలిక వసతుల కల్పనకు తగ్గనున్న టీనేజ్ యువత సంఖ్యను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల విజయవాడలో జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో అధికారులు తేల్చిచెప్పడం గమనార్హం.