రాష్ట్రీయం

గెట్టు దాటిన గొర్రెలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో గొర్రెల సంపద పెంచి గొల్ల, కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడిచేలా దళారుల దందాను జోరుగా కొనసాగుతోంది. మరో వైపు ప్రభుత్వం సబ్సిడీతో కొనుగోలు చేసి ఇచ్చిన గొర్రెలను దసరా సీజన్‌లో అమ్మేసుకుంటున్న పరిస్థి తీ కనిపిస్తోంది. ప్రభుత్వ ఆశయం నెరవేరకముందే అక్రమార్కుల దందాను క్షేత్రస్థాయి సిబ్బంది నిస్సహా యంగా చూస్తున్నారు. రాష్ట్రంలో గొర్రెల సంపదను గణనీయంగా పెంచాలన్న ఉద్దేశం నీరుగారకుండా ముందస్తుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్రమార్కులు కొందరు ఏకంగా ప్రభుత్వానే్న బురిడీ కొట్టించిన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గొర్రెల సంపదకు అదనంగా ప్రభుత్వం కల్పించిన సబ్సిడీతో పక్క రాష్ట్రాల నుంచే కొనుగోలు చేయాలన్న నిబంధన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పక్కదారి పడుతుంటే, కరీంనగర్ జిల్లాలో సబ్సిడీ గొర్రెలు అప్పుడే దసరా పండుగ సీజన్‌లో అమ్మకాల కోసం మండికి తరలిపోయాయి. దీంతో సబ్సిడీ గొర్రెల అమ్మకంపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పెంపకం పథకంద కింద దరఖాస్తు చేసుకున్న వారిలో సగంమందికి గొర్రెలు పంపిణీ చేసింది. ఒక్కో దరఖాస్తును ఒక యూనిట్‌గా పరిగణించి 20 గొర్రెలు, ఒక పొట్టేలును ప్రభుత్వం
కొనుగోలు చేసి ఇచ్చింది. ఒక్కో యూనిట్ వ్యయాన్ని రూ.లక్ష 26 వేలుగా ఖరారు చేసి దీనిలో లబ్ధిదారుని వాటాగా రూ.32,750, ప్రభుత్వ వాటాగా రూ.93.250గా నిర్ణయించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి కొనుగోలు చేసే గొర్రెలను తప్పని సరిగా పక్క రాష్ట్రాల నుంచే తేవాలనే నిబంధన పెట్టింది. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, మక్తల్, ధరూర్, మల్దకల్, అయిజ, గట్టు ప్రాంతాలకు చెందిన గొర్రెలను సరిహద్దులోని కర్నాటక ప్రాంతానికి తరలించి పొరుగు రాష్ట్రంలో కొనుగోలు చేసినట్టు చిత్రీకరించి తిరిగి వాటినే గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాకు విక్రయించి ప్రభుత్వ సబ్సిడీని పక్కదారి పట్టించినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ప్రభుత్వ సబ్సిడీతో ఇచ్చిన గొర్రెలను ఏడాదిపాటు అమ్మకుండా చూసే అధికారం తమకుంది కాని ఇప్పటికే వారు పెంచుకున్న వాటిని అమ్మకుండా నిలువరించే అధికారం లేదని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గొర్రెల పెంపకాన్ని జీవనోపాధిగా ఎంచుకున్న ఈ వృత్తిదారులు వాటిని విక్రయించడం ఒకవిధంగా తప్పు కూడా కాదు. అయితే ఇక్కడో తిరకాసు ఉంది. కర్నాటక సరిహద్దులోని పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గొర్రెల పెంపకం దారులు తాము పెంచుకున్న గొర్రెలను కర్నాటక వ్యాపారులకు విక్రయించి తిరిగి వాటినే ప్రభుత్వ కల్పించిన సబ్సిడీ పథకం కింద కొనుగోలు చేయడం పెద్ద కుంభకోణంగా మారింది. గద్వాల జిల్లాలో 5,500 యూనిట్లు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 2370 యూనిట్ల కోసం కొనుగోలు చేసిన సుమారు 50 వేల గొర్రెలలో సగానికి పైగా ఇక్కడి నుంచి కర్నాటకు తరలించి తిరిగి వాటినే కొనుగోలు చేయడం వల్ల కోట్లాది రూపాయల ప్రభుత్వ సబ్సిడీ పక్కదారి పట్టినట్టు అధికారుల దృష్టికి వచ్చింది.
గొర్రెల పథకంలో ఇదో మోసం కాగా కరీంనగర్ జిల్లాలో మరోరకమైన మోసం వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలో లబ్ధిదారులకు కొనుగోలు చేసిన గొర్రెలను అప్పుడే దసరా పండుగ సందర్భంగా మండీలకు అమ్మేసినట్టు కరీంనగర్ కలెక్టర్ దృష్టికి రావడంతో పశుసంవర్ధకశాఖకు చెందిన ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లను విచారణకు ఆదేశించారు. సబ్సిడీ గొర్రెల అమ్మకం ఒక్క జమ్మికుంట మండలంలోనే జరిగిందా? లేక హుజూరాబాద్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూరు మండలాల్లో కూడా జరిగిందా? అనే అనుమానంపై విచారణ జరుగుతున్నట్టు గొర్రెల పథకాన్ని పర్యవేక్షిస్తున్న అధికారుల సమాచారం.