రాష్ట్రీయం

రైతు చనిపోయాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కరీంనగర్, సెప్టెంబర్ 24: తెరాస సర్కారు చేపట్టిన దళితుల భూ పంపి ణీ కార్యక్రమం నిండు ప్రాణాన్ని బలిగొంది. భూమి కోసం యువ రైతు కొద్దిరోజుల క్రితం ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ 22 రోజులపాటు మృత్యువుతో పోరాడి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. దళితులకు భూ పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, తనకు రావలసిన మూడెకరాల భూమి దక్కలేదని మనోవేదనకు గురైన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మహాంకాళి శ్రీనివాస్, మరో రైతు యాలాల పరశురాములు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆఫీసు వద్ద ఈనెల 3న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో మహాంకాళి శ్రీనివాస్ ఒళ్లు కాలిపోగా, పరశురాములు తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా మంత్రి, ఎంపీలు బాధితుల ప్రాణాలను కాపాడుతామని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో 22రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నాడు. కాగా మరో వ్యక్తి పరశురాములు కోలుకున్నాడని, సోమవారం ఇతణ్ని డిశ్చార్జి చేస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మహాంకాళి శ్రీనివాస్ మృతిచెందగా ఆసుపత్రి
వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. భారీ బందోబస్తు మధ్య మృతదేహాన్ని సొంతూరికి తరలించారు. ఎమ్మెల్యే రసమయి ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
భగ్గుమన్న ప్రతిపక్షాలు, దళిత సంఘాలు
యువ రైతు మహంకాళి శ్రీనివాస్ మృతి పట్ల ప్రతిపక్షాలు, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, రైతు మృతికి కారకుడైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో బిజెపి, టిడిపి, కాంగ్రెస్, సిపిఐ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పలుచోట్ల ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
నేడు బంద్‌కు పిలుపు
రైతు శ్రీనివాస్ మృతికి నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం మానకొండూరు నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం వద్ధ పోలీసులు భారీగా మోహరించారు.