రాష్ట్రీయం

తొక్కిసలాటపై వౌనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 18: గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 29మంది మృతి చెందిన సంఘటనపై జస్టిస్ సివై సోమయాజులు ఏక సభ్య కమిషన్ సోమవారం ఇక్కడ న్యాయ విచారణ మొదలెట్టింది. బార్ కౌన్సిల్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, అర్బన్ జిల్లా ఎస్పీ హరికృష్ణ, ప్రభుత్వం తరపున వాదించేందుకు నియమితులైన సిహెచ్ ప్రభాకరరావు, కమిషన్ కోరిక మేరకు సహకారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీనియర్ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు విచారణకు హాజరయ్యారు. తొక్కిసలాట సంఘటనపై ఎవరైనా సమాచారం అందించాలనుకునే వారు అఫిడవిట్లు సమర్పించాలని గత డిసెంబర్ 18న జస్టిస్ సోమయాజులు కమిషన్ జారీచేసిన నోటిఫికేషన్‌కు స్పందించి కేవలం ముప్పాళ్ల సుబ్బారావు ఒక్కరే అఫిడవిట్ దాఖలుచేశారు. దాంతో ఆయనకు మాత్రమే నోటీసు జారీ అయ్యింది. నోటీసు అందుకున్న ముప్పాళ్ల సుబ్బారావు మాత్రమే విచారణకు హాజరయ్యారు. మరెవ్వరూ విచారణకు హాజరుకాకపోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పుష్కర్‌ఘాట్ తొక్కిసలాటపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలుగానీ, వ్యక్తులుగానీ ఎవరూ జస్టిస్ సోమయాజులు కమిషన్ ముందు వాదనలు వినిపించేందుకు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. న్యాయవాది ముప్పాళ్ల కూడా అఫిడవిట్ దాఖలు చేయకపోయి ఉంటే విచారణ ముందుకు సాగేదికాదు. ఇంతకుముందు కమిషన్‌కు సమర్పించిన డాక్యుమెంట్లతోపాటు అదనంగా మరికొన్ని ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియో క్లిప్పింగులు న్యాయవాది సుబ్బారావు విచారణ సమయంలో కమిషన్ జస్టిస్ సోమయాజులుకు సమర్పించారు.
విచారణను ఎలా సాగించాలన్న అంశంపై తొలి విచారణలో జస్టిస్ సోమయాజులు నిర్ణయించారు. బహిరంగ విచారణగానే నిర్వహించాలని, సివిల్ ప్రోసీజర్ కోడ్‌కు అనుగుణంగా విచారణ కొనసాగించాలని నిర్ణయించారు. ముప్పాళ్ల సుబ్బారావు దాఖలు చేసిన అఫిడవిట్లపై ప్రభుత్వం తరపున వివరణ సమర్పించడానికి గడువుకావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది సిహెచ్ ప్రభాకరరావు, సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చేవారి తరపున అఫిడవిట్లు దాఖలు చేయడానికి గడువు కావాలని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కోరటంతో కమిషన్ జస్టిస్ సోమయాజులు గడువును మంజూరు చేశారు. తొక్కిసలాట సంఘటనలో గాయపడిన 36మందికి కూడా నోటీసులు జారీ చేయాలని కమిషన్ నిర్ణయించటంతో, గాయపడిన వారి జాబితాను అడ్రస్సులతో సహా ఈనెల 27లోపు కమిషన్‌కు సమర్పిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రభాకరరావు కమిషన్‌కు విన్నవించారు. గాయపడ్డవారి జాబితాను ప్రభుత్వం సమర్పించిన అనంతరం తమ వాదనలకు మద్దతునిస్తూ సాక్ష్యం చెప్పేవారి అఫిడవిట్లు దాఖలు చేసేందుకు గడువు కావాలని ముప్పాళ్ల సుబ్బారావు కోరారు. గాయపడ్డవారికి, సాక్ష్యం చెప్పేందుకు ముందుకొచ్చేవారికి రిజిస్టర్డ్ పోస్టులో నోటీసులు పంపిన అనంతరం తదుపరి విచారణ తేదీని ప్రకటించాలని కమిషన్ జస్టిస్ సోమయాజులు నిర్ణయించి, విచారణను వాయిదావేశారు.

చిత్రం... పుష్కరఘాట్ తొక్కిసలాటపై విచారణ ప్రారంభించిన ఏకసభ్య కమిషన్ జస్టిస్ సోమయాజులు