రాష్ట్రీయం

ప్లాస్టిక్‌పై ప్రజా చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: యాభై మెక్రాన్లకు తగ్గిన ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై ఇప్పటికే బల్దియా నిషేధం విధించినా, నగరంలో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ, మానవాళి మనుగడనే ప్రశ్నార్ధకంగా చేయనున్న ఈ ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు బల్దియా వచ్చే నెల 2వ తేదీ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకవైపు ప్రజల్లో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన పెంచటంతో పాటు 50 మైక్రాన్ల కన్నా తక్కువ మైక్రాన్లతో తయారు చేసిన ప్లాస్టిక్ కవర్లను విక్రయించే వారిపై, కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతే సేవ’ సందర్భంగా ప్లాస్టిక్‌పై విస్త్రృత అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రతి దుకాణం ముందు ప్లాసిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించి, దాని స్థానంలో జౌళీ, క్లాత్ బ్యాగ్‌లను ఉపయోగించాలని కోరుతూ బ్యానర్లను ఏర్పాటు చేయాలని దుకాణం యజమానులకు సూచించనున్నారు. గతంలో మటన్, చికెన్ షాపులకు వెళ్లేటపుడు టిఫిన్ బాక్సులను తీసుకుని వెళ్లే అలవాటును తిరిగి నగరవాసుల్లో కల్పించాలన్నదే జిహెచ్‌ఎంసి ప్రధానోద్దేశ్యం.
మహానగరంలో గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సుమారు 20లక్షల గృహాలున్నాయి. వీటిలో నివాసముంటున్న 50లక్షల కుటుంబాల్లో కనీసం 20లక్షల మంది ప్రతిరోజు కూరగాయలు, నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. వీరిలో ఒక్కోక్కరు ఒక ప్లాస్టిక్ వర్‌లో కూరగాయాలు, నిత్యావసర వస్తువులకు వియోగించటం వల్ల వారానికి కోటి 40లక్షల కవర్లు, సంవత్సరానికి రూ. 73 కోట్ల కవుర్లు పంపిణీ అవుతున్నాయి. ఈ కవర్లలో అధికశాతం యాభై మెక్రాన్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉన్నవే ఉంటున్నాయి. ఈ కవర్లలో ఒక్క కవర్ నాలాల్లో పడితే అది మరుగునీటి ప్రవాహానికి అడ్డుకటగా మారటంతో పాటు మ్యాన్‌హోళ్లలో జాం అయి, మురుగునీరు రోడ్డుపై ప్రవహించేందుకు కారణమవుతోంది. ముఖ్యంగా మటన్, చికెన్ షాపులు, కర్రీ పాయింట్లలో యాభై మెక్రాన్ల లోపు ఉన్న కవర్ల వినియోగం ఎక్కువగా ఉంది. ఇది ఒక రకంగా ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదని అధికారులు సూచిస్తున్నారు. దీంతో నిర్వహణ పరమైన, పర్యావరణ పరమైన సమస్యలు కూడా అధికమవుతున్నాయి. వీటి నివారణకు ప్లాస్టిక్ వినియోగంపై పెద్ద ఎత్తన అవగాహన, ప్రచార కార్యక్రమాలతో పాటు యాభై మెక్రాన్లకు తక్కువ పరిమాణంలో ఉన్నన ప్లాస్టిక్ కవర్లను వినియోగించే షాపుల్లో బల్దియా తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున జరిమానాలు వసూలు చేస్తోంది. ఈ రకంగా 2వేల 432 మందికి రూ. 21.51లక్షలను జరిమానాలు వేసినట్లు బల్దియా అధికారులు తెలిపారు.
జిహెచ్‌ఎంసిలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది ఒకరినొకరు గౌరవించుకోవటంతో పాటు వివిధ పనులపై కార్పొరేషన్‌కు వచ్చే సందర్శకులతో కూడా మర్యాదగా, జవాబుదారిగా మాట్లాడటం అలవర్చుకునేందుకు వీలుగా సెప్టెంబర్ మాసాన్ని అధికారులు మర్యాద మాసోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమంలో కూడా అధికారులు కాస్త మర్యాదగా వ్యవహారించాలని కమిషనర్ సూచించారు.ఇందులో భాగంగా ప్రతి షాపుకు వెళ్లి ప్లాస్టిక్ వాడరాదని సూచిస్తూ, ఇతర సమస్యలపై వారికి అవగాహన పెంచే దిశగా అధికారులు కృషి చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు.