రాష్ట్రీయం

బ్లూవేల్ బూచియేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోన్న బ్లూవేల్ బూచి మాత్రమేనని కొందరు అంటుండగా, ఇది నిజంగా బూచియేనానని మీమాంస మరికొందరిలో వ్యక్తమవుతోంది. అదేబాటలో రియాల్టీ షో కూడా బూచిగానే మరికొందరు పరిగణిస్తున్నారు. బహుమతి ఇవ్వలేదని.. ప్రేయసి రాలేదని.. ప్రేమలో పడేందుకే ఇలాంటి షోలకు పాల్పడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బ్లూవేల్ సవాల్ ప్రభావంపై ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ అధికారులు విశే్లషించేందుకు పుదుచ్చేరి, మధురై వెళ్లారు. నేర పరిశోధన అధికారులు చేసిన పరిశీలనలో కొత్త అంశాలు వెల్లడయ్యాయి. బ్లూవేల్ సవాల్‌కు స్పందించి ఆత్మహత్యా యత్నాలు చేసుకున్న వారిలో 80శాతం మంది ఇతర కారణాలతో అలా చేసుకున్నట్టు తేలింది. బాధితులు బ్లూవేల్ గురించి తెలుసుకుని దాన్ని బూచిగా చూపి తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రియురాలి దృష్టి ఆకర్షించేందుకు ఇలా చేశారని అధికారులు విశే్లషించారు. రెండు నెలల వ్యవధిలోనే దేశంలోని మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో బ్లూవేల్ సవాల్‌తో ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సవాల్‌లో పాల్గొన్నవారు ఎలా ప్రవర్తిస్తారు? ఇందుకు గల కారణాలేంటీ? అని తెలుసుకుని హైదరాబాద్‌లో బ్లూవేల్ ప్రభావాన్ని తగ్గించాలని సైబర్ క్రైం పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే అధికారుల బృందం కొన్ని రాష్ట్రాల్లో పర్యటించింది. ఆత్మహత్యాయత్నం చేసుకున్నవారితో మాట్లాడినట్టు డిసిపి అవినాశ్ మహంతి తెలిపారు. రాజస్థాన్, నాగపూర్ పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి వివరాలు సేకరించారు. ఇటీవల మిడ్నాపూర్‌లో మృతిచెందిన ఓ 16ఏళ్ల కుర్రాడు బ్లూవేల్ సవాల్‌తో ఇల్లు వదిలి రాలేదని, వేరే కారణాలతో వచ్చాడని అక్కడి అధికారులు చెప్పినట్టు తెలిపారు. ఓ విద్యార్థి తన పుట్టిన రోజుకు స్నేహితులు, తల్లిదండ్రులు బహుమతి ఇవ్వకపోవడంతో అలా చేశాడని వివరించినట్టు డిసిపి పేర్కొన్నారు. మధురైలో 20 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డ విఘ్నేష్ అనే యువకుడు బ్లూవేల్ చిత్రాన్ని చేతిపై వేసుకోలేదని, గాటు మాత్రమే పెట్టుకున్నాడంటూ అక్కడి అధికారులు తమకు వివరించినట్టు ఆయన పేర్కొన్నారు. తన ప్రియురాలు సరిగ్గా మాట్లాడడం లేదని, తాను పిలిచిన చోటికి రాలేదన్న కారణంతోనే ఆమె దృష్టిని ఆకర్షించేందుకు విఘ్నేష్ ఇలా చేసినట్టు అక్కడి పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.
ప్రస్తుతం అంతర్జాలంలో బ్లూవేల్ లింకులు లేవని సైబర్ క్రైం డిసిపి అవినాష్ మహంతి తెలిపారు. బ్లూవేల్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పిల్లలను గమనిస్తూ ఉండాలని ఆయన సూచించారు. గత ఆరేళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో రియాల్టీ షోల ముసుగులో ఇలాంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయన్నారు. బ్లూవేల్, రియాల్టీ షోలకు పిల్లలు దూరంగా ఉండేలా గమనిస్తూ ఉండాలని డిసిపి అవినాష్ మహంతి సూచించారు.