రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో వచ్చే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. బంగాళాఖాతంలో తుపాను ద్రోణి ఏర్పడి ఉండటంతో వాతావరణంలో మార్పు వచ్చింది. దీని ప్రభావం వల్ల వచ్చే 24 గంటల్లో చాలాప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఆలంపూర్ లో ఐదుసెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలాఉండగా నైరుతీ రుతుపవనాలు ఈ నెల 28 నుండి ఉత్తర భారతదేశం నుండి ఉపసంహరణకు అనువైన వాతావరణం ఏర్పడిందని ఐఎండి వెల్లడించింది. తెలంగాణ, ఎపి నుండి నైరుతీరుతుపవనాల ఉపసంహరణ అక్టోబర్ 15 తర్వాత ఉండవచ్చని భావిస్తున్నారు.