రాష్ట్రీయం

మృగరాజుపై శ్రీవారి విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 25: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడవరోజైన సోమవారం ఉదయం 9గంటలకు సింహ వాహనంపై స్వామివారు యోగ నరసింహావతారంలో మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తుండడంతో స్వామి వారి ఉత్సవ వేళ ఒక వైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు మనో ఉల్లాసాన్ని కలిగించే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో భక్తులు తన్మయత్వంతో పులకరించారు. వాహనం ముందు వివిధ రకాల కళాకారుల సాంప్రదాయ దుస్తులతో నృత్యం చేశారు. భజన, కోలాట బృందాలు స్వామివారిని కీర్తిస్తూ ముందుకు సాగారు. తిరుమల జీయర్‌స్వాములు తమ శిష్య బృందంతో వేద మంత్రాలను పఠిస్తూ వాహనం వెంట నడిచారు. మాడ వీధుల్లో భక్తులు వేచివున్న గ్యాలరీల వద్ద వాహన సేవలను దర్శించుకునేలా టిటిడి చర్యలు చేపట్టింది. ఓవైపు వర్షం కురుస్తున్నా భక్తులు వాటిని లెక్కచేయకుండా ఆధ్యాత్మిక చింతనతో కర్పూర నీరాజనాలు పట్టి చేసిన గోవింద నామస్మరణలతో శేషాల కొండలు మారుమోగాయి. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్రలేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతం అవుతాయి. సోమరితనం నశించి, పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తిని ఇస్తుంది. ఆజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో తాను, తన వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంలో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 7 నుంచి రాత్రి 8గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగాయి. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడోరోజైన సోమవారం రాత్రి 9 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీ మలయప్ప స్వామి దర్శనమిచ్చారు.

చిత్రం..తిరుమల మాడ వీధుల్లో సోమవారం ఉదయం సింహ వాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి