రాష్ట్రీయం

నేడే శ్రీవారి గరుడోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 26: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యతవున్న వాహనసేవే గరుడ వాహన సేవ. ఈనెల 23న ధ్వజారోహణంతో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. అయితే స్వామివారికే అత్యంత్ర ప్రీతిపాత్రమైన గరుడ సేవ రోజున మాత్రం ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మూడు నెలల ముందునుంచే దృష్టిసారించే టిటిడి అధికారులు ఇందులో గరుడ వాహన సేవపై మాత్రం ప్రత్యేక దృష్టిసారిస్తారు. శ్రీ మహావిష్ణువే ఈ కలియుగంలో భక్తులను కరుణించి, వారి పాపాలను తొలగించడానికి తిరుమల కొండపై శ్రీ వేంకటేశ్వరుడిగా కొలువయ్యాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు వాహనాలపై మాడ వీధుల్లో ఊరేగే స్వామివారిని దర్శించుకోవడానికి తాపత్రయ పడతారు. అయితే ఈ ఉత్సవాల్లో ఐదవ రోజున జరిగే గరుడ వాహన సేవను దర్శించుకోవడానికి పరితపిస్తూ గంటల తరబడి వేచి ఉంటారు. అందుకే అన్ని వాహన సేవలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఉదయం 9గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటలకు ముగిస్తే, ఒక్క గరుడ వాహన సేవ మాత్రం సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి దాటి 1 గంటకు ముగుస్తుంది. అంటే దాదాపు 5.30 గంటలపాటు స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. గరుడునిపై వివిధ రకాల స్వరాణభరణాలతోపాటుగా శ్రీవారి మూల విరాట్టుకు అలంకరించే సహస్ర లక్ష్మీకాసుల హారాన్ని స్వామికి ధరింపజేస్తారు. శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చిన గోదాదేవి పూల మాలలు, చిలకలను అలంకరింపజేస్తారు. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి కాలినడకన తిరుమలకు చేరుకుని భక్తులు సమర్పించిన అందమైన ఛత్రాలతో స్వామిని కొలుస్తారు. ఇన్ని ప్రత్యేకతల మధ్య గరుడునిపై కొలువుదీరిన శ్రీపతిని దర్శించుకుంటే తమ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే వాహన సేవ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం అవుతుందంటే ఉదయం 9 గంటల నుంచే గ్యాలరీల్లో వేచివుండే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో టిటిడి మరింత అప్రమత్తమైంది. తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు వివిధ విభాగాల అధికారులతో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా అన్నప్రసాదం విభాగం, భద్రత, ఆరోగ్య విభాగం అధికారులకు, పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1గంట వరకు గ్యాలరీల్లోని భక్తులకు టిటిడి అన్నప్రసాదాలను, టీ, కాఫీలను ఉచితంగా అందిస్తుంది. దాదాపు 4లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేసింది. నాలుగు మాడ వీధుల్లో టాయ్‌లెట్స్‌ను భక్తులకు అందుబాటులో ఉంచింది. దాదాపు 700లకు పైగా సిసి కెమేరాలను ఏర్పాటు చేయడంతోపాటుగా 25 బాడీ వోర్న్ కెమేరాలతో సెక్యూరిటీ సిబ్బందిని భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ అసాంఘికశక్తులను, అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు సిద్ధమైంది. ఆరోగ్యశాఖ దాదాపు 2500 మంది పారిశుద్ధ్యకార్మికులను భక్తుల సేవకు వినియోగించి పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తోంది. అదనంగా మరో 3వేల మందిని అందుబాటులో ఉంచుకుని పరిశుభ్రతకు భంగం కలగకుండా ఎక్కడి చెత్తను అక్కడ నుంచి వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. వాహనాల వల్ల భక్తులు ఇబ్బందులు పడకుండా పార్కింగ్‌కు అవకాశం ఉన్న 7వేల వాహనాలనే కొండపైకి అనుమతిస్తూ మిగిలిన వాహనాలను తిరుపతిలోని అలిపిరి వద్దవున్న దేవలోక్, భారతీయ విద్యాభవన్‌ల వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ చేసే ఏర్పాట్లు చేసింది. శ్రీవారి భక్తులు అర్ధరాత్రి వరకు ఏసమయంలోనైనా ఆర్టీసీ బస్సులో తిరుమలకు రావడానికి అలాగే స్వామిని దర్శించుకున్న వెంటనే తిరిగి వెళ్లడానికి ఘాట్ రోడ్డును 24 గంటలు తెరిచి ఉంచుతోంది.