రాష్ట్రీయం

కొత్త పద్దు లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ప్రస్తుతం జాతీయస్థాయిలో పార్లమెంటుతో సహా అన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఏప్రిల్ 1నుంచి మార్చి 31 వరకు ఆర్ధిక సంవత్సరం విధానానే్న కొనసాగించాలని కేంద్ర ఆర్ధిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన సమాచారంలో సూచించింది. ఆర్థిక సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండాలని కొద్దికాలం క్రితం కేంద్రం ప్రతిపాదించటం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఆంధ్ర, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అంగీకరించాయి. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్థిక సంవత్సరం విధానం పరిశీలనలోనే ఉందని, కాని మారిన పరిస్ధితుల్లో రెండు కారణాల వల్ల ప్రస్తుత విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖలకు తెలిపింది. కేంద్రం ఈ ఏడాది వస్తు సేవా పన్ను (జిఎస్టీ) ఏకీకృత విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసింది. పన్నుల రంగంలో ఇది విప్లవాత్మకమైన నిర్ణయం. రాష్ట్రాల నుంచి రెవెన్యూ వసూళ్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. దీని ప్రభావం కచ్చితంగా తెలియాలంటే మార్చి 31 వరకూ ఆగక తప్పదు. ఈ సమయంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్ధిక సంవత్సరం వల్ల జిఎస్టీ రెవెన్యూ వసూళ్లపై సమగ్రత రాదని ఆర్ధిక నిపుణులు కేంద్రానికి నివేదించారు. నిరుడు కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసింది. దీని ప్రభావంపైనా కేంద్రం వివిధ ఏజన్సీల ద్వారా లోతైన విశే్లషణ చేస్తోంది. డిజిటలైజేషన్ విధానాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. జిఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వల్ల వచ్చిన మార్పులు తెలియాలంటే, ఇప్పటికిప్పుడు ఆర్ధిక సంవత్సరం విధానాన్ని మార్చ డం సరికాదని కేంద్రం భావిస్తోంది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధిక సంవత్సరం జనవరి- డిసెంబర్ విధానాన్ని ప్రతిపాదించారు. 1867నుంచి ఈ విధానం అమలులో ఉంది. ఆర్ధిక సంవత్సరం మార్పు అంటే ఆర్ధిక విధానాల్లో పూర్తి స్ధాయి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లే. దీని వల్ల పన్నుల చెల్లింపుకు ఇప్పుడు అనుసరిస్తున్న డెడ్‌లైన్లను కూడా మార్చాల్సి ఉంటుంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌ను ప్రతిపాదించే తేదీని ఫిబ్రవరి చివరి నుంచి ఫిబ్రవరి మొదటి వారానికి మార్చింది. ఆర్ధిక నిపుణులు శంకర్ ఆచార్య ఆధ్వర్యంలో ఒక కమిటీని ఆర్థిక సంవత్సరం నెలలను మార్చే విధానంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు కేంద్రం నియమించిన సంగతి విదితమే. నీతి ఆయోగ్ కూడా ఆర్థిక సంవత్సరం మార్పును స్వాగతించిన విషయం విదితమే.