రాష్ట్రీయం

247 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: కార్మిక, ఫ్యాక్టరీల శాఖలో వివిధ క్యాటగిరికి చెందిన 247 పోస్టుల డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులు 172, టెక్నికల్ అసిస్టెంట్‌లు 45, డ్రెస్సర్‌లు 18, లైబ్రరియన్లు రెండు, ఫార్మసిస్టు గ్రేడ్-2 పోస్టులు 10 భర్తీ చేస్తారు. ఈ పోస్టులను భర్తీ చేసే బాధ్యతను పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అప్పగించారు.