రాష్ట్రీయం

కెఎల్‌యూలో బడ్జెట్ అసెంబ్లీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు అనువైన ప్రదేశంపై ప్రభుత్వ, శాసనసభ, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు కెఎల్ యూనివర్సిటీని మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ రానున్న బడ్జెట్ సమావేశాలను రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తే సముచితంగా ఉంటుందన్న ప్రజల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకుని ఇందుకు అనువైన వేదిక గుర్తించేందుకు కెఎల్ యూనివర్సిటీని సందర్శించినట్లు స్పీకర్ తెలిపారు. శాసనసభ సమావేశాల నిర్వహణకు తగిన విధంగా భవనాలను కేటాయించేందుకు కెఎల్ యూనివర్సిటీ యాజమాన్యం ముందుకొచ్చిన మీదట తాము సందర్శనకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం భవనాల కేటాయింపు మాత్రమే సమావేశాల నిర్వహణకు సరిపోదని, ముఖ్యమంత్రి, మంత్రుల, సభ్యులు భద్రత, ఇతర సౌకర్యాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెప్పారు. ఇందుకోసం త్వరలోనే సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని స్పీకర్ వెల్లడించారు. ఈ పర్యటనలో స్పీకర్ వెంట శాసనసభ కార్యదర్శి సత్యనారాయణ, ముఖ్యమంత్రి భద్రతా అధికారి జోషి, రహదారులు, భవనాల శాఖ ఎస్‌ఇ కె.రాఘవేంద్రరావు, ఇఇ పి.మహేశ్వరరావు, కెఎల్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కె.హవీష్, వైస్ ఛాన్సలర్ ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... కెఎల్ యూనివర్సిటీ భవనాలు పరిశీలిస్తున్న స్పీకర్ కోడెల